ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా ఐదు పరాజయాల పరంపరకు ముగింపు పలికింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా ఐదు పరాజయాల పరంపరకు ముగింపు పలికింది. ముంబై ఇండియన్స్‌తో సీజన్‌లో తమ తొలి మ్యాచ్‌లో గెలిచిన సూపర్ కింగ్స్. లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో జరిగిన IPL 2025 సీజన్ 30వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌(Lucknow Super Giants)పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది, ఈ విజయంతో CSK 7 మ్యాచ్‌లలో 2 విజయాలు, 5 ఓటములతో అట్టడుగున నిలిచింది. LSG 7 మ్యాచ్‌లలో సీజన్‌లో మూడవ ఓటమిని చవిచూసింది. IPL 2025 స్టాండింగ్స్‌లో 4వ స్థానంలో నిలిచింది. లక్నోలో జరిగిన మ్యాచ్‌లో LSG 20 ఓవర్లలో 166/7 స్కోరు చేసింది. రిషబ్ పంత్ 49 బంతుల్లో 63 పరుగులు చేశాడు. మిచెల్ మార్ష్, ఆయుష్ బడోని, అబ్దుల్ సమద్‌ల ఆటతీరు LSG 160 పరుగులను దాటించడంలో సహాయపడింది. CSK తరఫున రవీంద్ర జడేజా 3 ఓవర్లలో 2/24 వికెట్లు పడగొట్టాడు. CSK 19.3 ఓవర్లలోనే విజయాన్ని నమోదు చేసింది. షేక్ రషీద్, సచిన్ రవీంద్ర CSKకి మంచి ఆరంభాన్ని ఇచ్చారు, 52 పరుగులు జోడించారు. CSK ఒక దశలో 111/5కి పడిపోయింది, తరువాత శివమ్ దూబే, ధోనీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. దూబే 37 బంతుల్లో అజేయంగా 43 పరుగులు చేశాడు. రవి బిష్ణోయ్ 3 ఓవర్లలో 2/18 తీసుకున్నాడు, దిగ్వేష్ సింగ్ రథి బాగా బౌలింగ్ చేశాడు, తన 4 ఓవర్లలో 1/23 తీసుకున్నాడు.

కాగా ఈ రోజు ఐపీఎల్ 2025లో ఒక మ్యాచ్ జరుగుతోంది, పంజాబ్ కింగ్స్ (PBKS) vs కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), మహారాజా యాదవింద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, ముల్లన్‌పూర్, చండీగఢ్ వేదికగా ఈ మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ గత మ్యాచ్‌లో ఓటమి తర్వాత బౌన్స్ బ్యాక్ చేయాలని చూస్తోంది, అటు KKR విజయంతో ఉత్సాహంగా ఉంది.

ehatv

ehatv

Next Story