Chennai Super Kings won by 27 runs : ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి చెన్నై.. ప్లేఆఫ్స్‌కు చేరువైన ధోనీ సేన
ఐపీఎల్ 55వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 27 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. ఎంఏ చిదంబరం స్టేడియంలో ఇరు జట్లు తలపడ్డాయి. చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. చెన్నై 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 167 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 140 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఐపీఎల్ 55వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) 27 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)ను ఓడించింది. ఎంఏ చిదంబరం స్టేడియం(MA Chidambaram)లో ఇరు జట్లు తలపడ్డాయి. చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(Mahendra Singh Dhoni) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. చెన్నై 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 167 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 140 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ప్రస్తుత ఐపీఎల్(IPL) సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఏడో విజయం సాధించింది. ఈ విజయంతో ప్లేఆఫ్‌కు(Playoffs) చెన్నై(Chennai) చేరువయ్యింది. ప్రస్తుతం 12 మ్యాచ్‌ల్లో 15 పాయింట్లతో ఉంది. మరోవైపు 11 మ్యాచ్‌ల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఇది ఏడో ఓటమి. ఎనిమిది పాయింట్లతో చివరిస్థానంలో ఉంది. ఢిల్లీ తర్వాతి మ్యాచ్ పంజాబ్ కింగ్స్‌తో మే 13న జరగనుంది. మే 14న కోల్‌కతాతో చెన్నై జట్టు తలపడనుంది.
మ్యాచ్‌లో ఢిల్లీ(Delhi) బ్యాటింగ్ చాలా పేలవంగా ఉంది. 168 పరుగుల ఛేజింగ్(Chaging)లో కూడా విఫలమైంది. ఢిల్లీకి బ్యాడ్ స్టార్ట్ ఇచ్చాడు ఓపెనింగ్ కు వచ్చిన కెప్టెన్ డేవిడ్ వార్నర్(David Warner). ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. మిచెల్ మార్ష్(Mitchell Marsh) కూడా 5 పరుగులు మాత్రమే చేశాడు. వెంటనే ఫిల్ సాల్ట్(Phillip Salt) (17) రూపంలో మరో దెబ్బ తగిలింది. ఆ తర్వాత మనీష్ పాండే(Manish Pandey) (27), రిలే రస్సో (35), రిపుల్ పటేల్ (10), అక్షర్ పటేల్(Axar Patel) (21) కూడా పెద్దగా రాణించలేకపోయారు. సీఎస్‌కే(CSK) తరఫున పతిరన అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే జట్టు 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. సీఎస్‌కే తరుపున ఓపెనింగ్‌కు వచ్చిన డెవాన్ కాన్వే(Devon Conway) 10 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. రుతురాజ్ గైక్వాడ్(Ruthuraj Gaikwad) కూడా 24 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. అజింక్యా రహానే(Aginkya Rahane) 21, మొయిన్ అలీ(Moeen Ali) 7, శివమ్ దూబే(Shivam Dubey) 25 పరుగులు చేశారు. చివర్లో రవీంద్ర జడేజా(Ravindra Jadeja) 21, మహేంద్ర సింగ్ ధోనీ(Mahendra Singh Dhoni) 9 బంతుల్లో 20 పరుగులు చేయడంతో చెన్నై 167 పరుగులు చేసింది.