CSK vs GT IPL Final Match : చివరి ఓవర్ థ్రిల్లర్.. 5వ సారి టైటిల్ నెగ్గిన చెన్నై..!
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐదోసారి ఛాంపియన్‌గా నిలిచింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ఆ తర్వాత వర్షం రావడంతో రెండున్నర గంటల పాటు ఆటకు అంతరాయం కలిగింది. మ్యాచ్ 12.10 గంటలకి తిరిగి ప్రారంభమైంది. డక్‌వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం..
చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జట్టు ఐదోసారి ఛాంపియన్(Champion)గా నిలిచింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం(Narendra Modi Stadium)లో జరిగిన ఫైనల్లో(Final) తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్(Gujarat) 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ఆ తర్వాత వర్షం రావడంతో రెండున్నర గంటల పాటు ఆటకు అంతరాయం కలిగింది. మ్యాచ్ 12.10 గంటలకి తిరిగి ప్రారంభమైంది. డక్‌వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం(DL Method).. చెన్నైకి 15 ఓవర్లలో 171 పరుగుల విజయలక్ష్యాన్ని విధించారు. చివరి బంతి వరకూ పోరాడిన చెన్నై(Chennai) ఫైనల్లో విజయం సాధించింది. ఈ విజయంతో చెన్నై ఐదుసార్లు టైటిల్ గెలిచిన ముంబై(Mumbai Indians) రికార్డును సమం చేసింది.
తొలుత గుజరాత్ జట్టులో సాయి సుదర్శన్(Sai Sudarshan) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 47 బంతుల్లో 8 ఫోర్లు, ఆరు సిక్సర్ల సహాయంతో 96 పరుగులు చేసి ఔటై తృటిలో సెంచరీని కోల్పోయాడు. ఓపెనర్లు సాహా(Vriddhiman Saha)(54), శుభ్‌మన్ గిల్(Shubhman Gill)(39) రాణించారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya) 12 బంతుల్లో 21 పరుగులు చేసి నాటౌట్‌గా మిగిలాడు. చెన్నై బౌలర్లలో పతిరాన రెండు వికెట్లు పడగొట్టగా.. జడేజా(Jadeja), చాహర్(Chahar) తలో వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ దిగిన చెన్నై జట్టులో డెవాన్ కాన్వే 25 బంతుల్లో అత్యధికంగా 47 పరుగులు చేశాడు. రుతురాజ్ గైక్వాడ్(26), శవమ్ దూబే(32), రహానే(27), రాయుడు(19), జడేజా(15) ప్రతి ఒక్కరూ విలువైన పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ(Mohit Sharma) మూడు వికెట్లు, నూర్ అహ్మద్(Noor Ahmad) రెండు వికెట్లు తీశారు.
మ్యాచ్‌కే హైలెట్ ఆ మూడు ఓవర్లు..
చివరి మూడు ఓవర్లలో చెన్నై విజయానికి 38 పరుగులు చేయాల్సి ఉంది. 13వ ఓవర్‌లో మోహిత్ శర్మ బౌలింగ్‌కు వచ్చాడు. క్రీజులో అంబటి రాయుడు(Ambati Rayudu), శివమ్ దూబే(Shivam Dubey) ఉన్నారు. తొలి మూడు బంతుల్లోనే చివరి మ్యాచ్ ఆడుతున్న అంబటి రాయుడు రెండు సిక్సర్లు, ఒక ఫోర్ బాదాడు. నాలుగో బంతికి అవుటయ్యాడు. అయితే మ్యాచ్‌ను చెన్నైకి అనుకూలంగా మలిచాడు. ఆ తర్వాతి బంతికే ధోనీ(Dhoni) ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. ఈ ఓవర్‌లో 17 పరుగులు వచ్చాయి. మహ్మద్ షమీ(Mohammad Shami) వేసిన 14వ ఓవర్లో ఎనిమిది పరుగులు వచ్చాయి. చివరి ఓవర్‌లో సీఎస్‌కే(CSK) విజయానికి 13 పరుగులు కావాలి. తొలి నాలుగు బంతుల్లో మూడు పరుగులు వచ్చాయి. చివరి రెండు బంతుల్లో 10 పరుగులు అవసరం. రవీంద్ర జడేజా(Ravindra Jadeja) స్ట్రైక్‌లో ఉన్నాడు. ఐదో బంతికి జడేజా సిక్సర్ బాదాడు. చివరి బంతికి ఫోర్ కొట్టి చెన్నైకి విజయాన్ని అందించాడు జడేజా.
అద్భుతంగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 214 పరుగులు చేసింది. ఐపీఎల్ ఫైనల్‌లో ఇదే అత్యధిక స్కోరు. అంతకుముందు 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది.