ఐపీఎల్-2023లో 29వ మ్యాచ్ శుక్రవారం చెపాక్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (CSK vs SRH)తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడింది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్.. హైదరాబాద్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సీఎస్‌కేలో జడేజా అద్భుతంగా బౌలింగ్ చేయ‌గా.. బ్యాటింగ్‌లో డెవాన్ కాన్వే అజేయ అర్ధ సెంచరీ చేశాడు. టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.

ఐపీఎల్-2023లో 29వ మ్యాచ్ శుక్రవారం చెపాక్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (CSK vs SRH)తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడింది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings).. హైదరాబాద్‌(Sunrisers Hyderabad)పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సీఎస్‌కేలో జడేజా(Ravindra Jadeja) అద్భుతంగా బౌలింగ్ చేయ‌గా.. బ్యాటింగ్‌లో డెవాన్ కాన్వే(Devon Conway) అజేయ అర్ధ సెంచరీ చేశాడు. టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ(MS Dhoni) బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. సన్‌రైజర్స్ బ్యాటింగ్‌లో హ్యారీ బ్రూక్(Harry Brook) 18 పరుగులు చేసి ఆకాష్ సింగ్(Akash Singh) బౌలింగ్‌లో అవుట‌య్యాడు. ఓపెనర్‌గా వచ్చిన అభిషేక్ శర్మ(Abhishek Sharma) (34 పరుగులు) జట్టు తరఫున అత్యధిక స్కోరు చేశాడు. రాహుల్ త్రిపాఠి(Rahul Tripati) 21 పరుగులు చేశాడు. 12 పరుగుల స్కోరు వద్ద కెప్టెన్ ఐడెన్ మార్క్‌రామ్(Aiden Markram).. మహేశ్ తీక్షణ(Mahesh Theekshana) బౌలింగ్‌లో పెవిలియ‌న్ చేరాడు. హెన్రీచ్‌ క్లాసెన్(Henrich Klassen) 17 పరుగులు చేశాడు. మయాంక్ అగర్వాల్(Mayank Agarwal) కేవలం 2 పరుగులు మాత్రమే చేయగలిగాడు. మార్కో జాన్సెన్ 17 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో ఆ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. చెన్నై బౌల‌ర్ల‌లో రవీంద్ర జడేజా 22 పరుగులకు 3 వికెట్లు తీయగా, మహేశ్ తీక్షణ, ఆకాశ్ సింగ్, మతిషా పతిరనా తలో వికెట్ తీశారు.

లక్ష్య ఛేదన‌లో చెన్నైకు శుభారంభం లభించింది. రుతురాజ్(Ruthuraj Gaikwad), డెవాన్ కాన్వే తొలి వికెట్‌కు 87 పరుగుల భాగస్వామ్యాన్ని నెకొల్పారు. కాన్వే ఈ సీజన్‌లో వరుసగా మూడో అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. రుతురాజ్ 35 పరుగులు చేశాడు. అజింక్య రహానే(Ajinkya Rahane), రాయుడు(Ambati Rayudu) భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేకపోయారు. 110 పరుగుల వద్ద చెన్నై రెండో వికెట్ కోల్పోయింది. స్కోరు 122 వద్ద మూడో వికెట్ ప‌డినా.. అప్పటికే మ్యాచ్ పై హైదరాబాద్ పట్టు కోల్పోయింది. ఒక ఎండ్‌లో డెవాన్ కాన్వే పరుగులు చేస్తూనే ఉన్నాడు. మొయిన్ అలీ(Moeen Ali) ఫోర్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ విజయంతో చెన్నై 6 మ్యాచ్‌ల్లో 4 మ్యాచ్‌లు గెలిచి 8 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.

Updated On 22 April 2023 6:03 AM GMT
Yagnik

Yagnik

Next Story