Mumbai Indians vs Chennai Super Kings : రహానే విధ్వంసం.. ముంబై ఇండియన్స్‌పై సీఎస్‌కే ఘనవిజయం
చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings), ముంబై ఇండియన్స్(Mumbai Indians) జట్ల మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌లో ధోనీ(MS Dhoni) సేన 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట ముంబై 158 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 3 వికెట్లకు 159 పరుగులు చేసి సీఎస్‌కే జట్టు సులభంగా చేధించింది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో […]
చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings), ముంబై ఇండియన్స్(Mumbai Indians) జట్ల మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌లో ధోనీ(MS Dhoni) సేన 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట ముంబై 158 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 3 వికెట్లకు 159 పరుగులు చేసి సీఎస్‌కే జట్టు సులభంగా చేధించింది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 158 పరుగులు చేసింది. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) 21 పరుగులు చేశాడు. ముంబై ఇన్నింగ్సులో ఇషాన్ కిషన్ అత్యధికంగా 32 పరుగులు చేశాడు. కామెరూన్ గ్రీన్ (12), సూర్యకుమార్ యాదవ్ (1), తిలక్ వర్మ (22), అర్షద్ ఖాన్ (2) అంతా విఫలమయ్యారు. చివర్లో టిమ్ డేవిడ్ (31) హృతిక్ షోకీన్ (18) పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. బౌలింగ్‌లో రవీంద్ర జడేజా(Ravindra Jadeja) చెలరేగిపోయాడు. నాలుగు ఓవర్లలో 20 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. అతడికి తోడు మిచెల్ సాంట్నర్ 2 వికెట్లు తీశాడు. తుషార్ దేశ్‌పాండే కూడా 2 వికెట్లు నేలకూల్చాడు. ఐపీఎల్ అరంగేట్రం చేసిన సిసంద మగలకు 1 వికెట్ దక్కింది.
చేధనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కు శుభారంభం లభించలేదు. డెవాన్ కాన్వే ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత రితురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad), అజింక్యా రహానే(Ajinkya Rahane) అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి సీఎస్‌కే జట్టును లక్ష్యం దిశగా తీసుకెళ్లారు. రహానే అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతను 27 బంతుల్లో 7 ఫోర్లు, మూడు సిక్సర్లతో 61 పరుగులు చేశాడు. శివమ్ దూబే(Shivam Dube) 26 బంతుల్లో 28 పరుగులు చేశాడు. ముంబై బౌలర్లలో కుమార్ కార్తికేయ సింగ్(Kumar Kartikeya) 1/24 సర్వాలేదనిపించాడు. మిగతా బౌలర్లు ఎవరూ ప్రభావం చూపలేకపోయారు.
ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య 34 మ్యాచ్‌లు జరగ్గా, అందులో ముంబై జట్టు 20 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. సీఎస్‌కే 14 మ్యాచ్‌లను గెలుచుకుంది. సీఎస్‌కే మునుపటి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్‌ను ఓడించింది. ముంబై గత మ్యాచ్‌లో ఆర్‌సీబీపై ముంబై 8 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
వాంఖడే స్టేడియం(Wankhede Stadium)లో ముంబై ఇండియన్స్ మొత్తం 71 మ్యాచ్‌లు ఆడగా.. అందులో 44 మ్యాచ్‌లు గెలిచింది. 27 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ఈ మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో ముంబై 10 మ్యాచ్‌లు ఆడగా 7 గెలిచింది. సీఎస్‌కే జట్టు 3 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఇలాంటి పరిస్థితుల్లో వాంఖడే స్టేడియంలో ముంబై జట్టుదే పైచేయి అనుకున్నారు. కానీ ముంబై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది.