ఐపీఎల్‌-2023లో సోమ‌వారం మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings), రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు(Royal Challengers Bangalore) జ‌ట్ల‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్(Faf du Plessis) టాస్ గెలిచిన మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. చెన్నై బ్యాట్స్‌మెన్ అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆర్‌సీబీకి 227 లక్ష్యాన్ని నిర్దేశించారు. ల‌క్ష్యానికి ద‌గ్గ‌ర‌గా వ‌చ్చిన ఆర్‌సీబీ జట్టు 8 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆర్సీబీ జ‌ట్టులో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఈ […]

ఐపీఎల్‌-2023లో సోమ‌వారం మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings), రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు(Royal Challengers Bangalore) జ‌ట్ల‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్(Faf du Plessis) టాస్ గెలిచిన మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. చెన్నై బ్యాట్స్‌మెన్ అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆర్‌సీబీకి 227 లక్ష్యాన్ని నిర్దేశించారు. ల‌క్ష్యానికి ద‌గ్గ‌ర‌గా వ‌చ్చిన ఆర్‌సీబీ జట్టు 8 పరుగుల తేడాతో ఓడిపోయింది.

ఆర్సీబీ జ‌ట్టులో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఈ మ్యాచ్‌లో 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. మహిపాల్ లోమ్రోర్ ఖాతా తెరవలేదు. తొలి రెండు వికెట్ల పతనం తర్వాత కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్, గ్లెన్ మాక్స్‌వెల్‌(Glenn Maxwell) అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. డు ప్లెసిస్ 62 పరుగులు చేశాడు. 76 పరుగుల వద్ద మ్యాక్స్‌వెల్ ఔటయ్యాడు. దినేష్ కార్తీక్(Dinesh Karthik) కచ్చితంగా 28, సుయాష్ ప్రభుదేశాయ్ 19 పరుగులు, షాబాజ్ అహ్మద్ 12 పరుగులు చేశారు. గెలుపు కోసం చివరి ఓవర్‌లో ఆర్సీబీ జట్టుకు 18 పరుగులు అవసరం. సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ బంతిని మతీషా పతిరానాకు అందించాడు. పతిరానా ఆ ఓవర్‌లో 10 పరుగులిచ్చి ఆఖరి బంతికి సుయాష్ ప్రభుదేశాయ్ వికెట్ తీశాడు. దీంతో సీఎస్‌కే విజ‌యం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్‌లో తుషార్ దేశ్‌పాండే(Thushar Desh Pandey) 3 వికెట్లు, మతీషా పతిరనా 2 వికెట్లు, మొయిన్ అలీ ఒక వికెట్ దక్కించుకున్నారు.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కూడా శుభారంభం దక్కలేదు. రితురాజ్ గైక్వాడ్(Rythuraj Gaikwad) కేవలం 3 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. అనంత‌రం డెవాన్ కాన్వే(Devon Conway), అజింక్యా రహానే భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. 20 బంతుల్లో 37 పరుగులు చేసి రహానే ఔటయ్యాడు. ఆ తర్వాత శివమ్ దూబే 27 బంతుల్లో 52 పరుగులతో రాణించాడు. డెవాన్ కాన్వే 45 బంతుల్లో 83 పరుగులు చేశాడు. అంబటి రాయుడు 14 పరుగులు చేశాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ 226 పరుగులు చేసింది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్, ఆర్సీబీ మధ్య 31 మ్యాచ్‌లు జరగగా.. సీఎస్‌కే 20 మ్యాచ్‌లు గెలిచింది. ఆర్సీబీ 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్ ఫ‌లితం తేల‌లేదు.

Updated On 17 April 2023 8:58 PM GMT
Yagnik

Yagnik

Next Story