భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లో భాగంగా ఆదివారం జ‌రిగిన‌ రెండో మ్యాచ్‌లో భారత్ 44 పరుగుల తేడాతో విజయం సాధించింది.

భారత్(India), ఆస్ట్రేలియా(Australia) మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లో భాగంగా ఆదివారం జ‌రిగిన‌ రెండో మ్యాచ్‌(Second T20)లో భారత్ 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 2-0 ఆధిక్యంలో నిలిచింది. తిరువనంతపురం వేదికగా జరిగిన‌ ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్(Toss) గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా ఆస్ట్రేలియా జట్టు 191 పరుగులకే ఆలౌటైంది.

తొలుత భారత్ తరఫున ముగ్గురు బ్యాట్స్‌మెన్ హాఫ్ సెంచరీలు సాధించారు. యశస్వి జైస్వాల్(Jashaswi Jaishwal) 53 పరుగులు, రితురాజ్ గైక్వాడ్(Ruthuraj Gaikwad) 58 పరుగులు, ఇషాన్ కిషన్(Ishan Kishan) 52 పరుగులు చేశారు. చివర్లో రింకూ సింగ్(Rinku Singh) తొమ్మిది బంతుల్లో 31 పరుగులతో మెరుపు ఇన్నింగ్సు ఆడాడు. ఆస్ట్రేలియా తరఫున నాథన్ ఎల్లిస్ మూడు వికెట్లు పడగొట్టాడు. మార్కస్ స్టోయినిస్‌కు ఒక వికెట్ దక్కింది.

అనంత‌రం ఆస్ట్రేలియా ఓపెన‌ర్లు శుభారంభం చేయడంతో రెండో ఓవర్‌లోనే జట్టు స్కోరు 30 పరుగులకు చేరుకుంది. అయితే 19 పరుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వద్ద షార్ట్ అవుట్ కావడంతో కంగారూ జట్టు పట్టాలు తప్పింది. ఇంగ్లిష్ కూడా రెండు పరుగులు మాత్ర‌మే చేసి ఔట్‌ కాగా, 12 పరుగులకే మాక్స్‌వెల్‌ ఔటయ్యాడు. స్మిత్(19) కూడా త్వ‌ర‌గా ఔటయ్యాడు. స్టోయినిస్, డేవిడ్ హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడం ద్వారా జట్టుకు పునరాగమనం చేసారు.. అయితే డేవిడ్ అవుట్ అయిన తర్వాత భారత్ విజయం దాదాపు ఖాయమైంది. డేవిడ్ 37, స్టోయినిస్ 45 పరుగులు చేశారు. చివర్లో మాథ్యూ వేడ్ అజేయంగా 42 పరుగులు చేశాడు. అయితే ఆస్ట్రేలియా జట్టు తొమ్మిది వికెట్లు కోల్పోయి 191 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ తరఫున ప్రసి్ద్‌ కృష్ణ, రవి బిష్ణోయ్ చెరో మూడు వికెట్లు తీశారు. అర్ష్‌దీప్‌ సింగ్‌, అక్షర్‌ పటేల్‌, ముఖేష్‌ కుమార్‌లకు ఒక్కో వికెట్ దక్కింది.

Updated On 26 Nov 2023 10:18 PM GMT
Yagnik

Yagnik

Next Story