చెన్నై సూపర్ కింగ్స్ వరుస విజయాలతో దూసుకుపోతూ ఉంది. ఆ జట్టుకు ఓ బ్యాడ్ న్యూస్. ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ వారం రోజులపాటు జట్టుకు దూరమయ్యాడని ఆ జట్టు హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తెలిపారు. స్టోక్స్ ఈ సీజన్‌లో ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఈ నెల 8న ముంబైతో జరిగిన మ్యాచ్‌లో స్టోక్స్ కాలివేలికి గాయమైంది.

చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) వరుస విజయాలతో దూసుకుపోతూ ఉంది. ఆ జట్టుకు ఓ బ్యాడ్ న్యూస్. ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్(Ben Stokes) వారం రోజులపాటు జట్టుకు దూరమయ్యాడని ఆ జట్టు హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్(Stephen Fleming) తెలిపారు. స్టోక్స్ ఈ సీజన్‌లో ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఈ నెల 8న ముంబైతో జరిగిన మ్యాచ్‌లో స్టోక్స్ కాలివేలికి గాయమైంది. ఆ తర్వాత స్టోక్స్ ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. మరో వారం తర్వాత కానీ అతడు జట్టులోకి వచ్చే అవకాశం లేదని టీమ్ మెనేజ్‌మెంట్‌ చెబుతోంది. స్టోక్స్‌కు అయిన గాయం మరీ పెద్దదేం కాదని ఫ్లెమింగ్ అంటున్నాడు.

ధోనీ(MS Dhoni) మోకాలి గాయం గురించి మాట్లాడుతూ దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నాడు. గాయం మరీ భరించలేకుండా ఉండి తానిక ఆడలేనని తెలిస్తే ధోనీ తనంత తానే తప్పుకుంటాడని అన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో దీపక్ చాహర్(Deepak Chahar), సిసంద మంగళ(Sisanda Magala) గాయాలతో ఇప్పటికే జట్టుకు దూరమయ్యారు. పేసర్ సిమర్‌జీత్ సింగ్(Simarjeet Singh) గాయం కారణంగా గత దేశవాళీ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ప్రస్తుతం కోలుకుంటున్నాడు.

గత రాత్రి సన్ రైజర్స్(Sunrisers Hyderabad)) తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో చెన్నై విజయాన్ని అందుకుంది. 135 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన చెన్నై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 3 వికెట్లు కోల్పోయి చెన్నై 18.4 ఓవర్లలోనే 138 పరుగులు చేసి లక్ష్యాన్ని చేధించింది. ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టిక(Points Table)లో మూడో స్థానానికి ఎగబాకింది. చెన్నై ఇప్పటివరకు 6 మ్యాచ్ లు ఆడి 4 విజయాలు నమోదు చేసింది.

Updated On 22 April 2023 6:03 AM GMT
Yagnik

Yagnik

Next Story