ఐపీఎల్(IPL) లో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్(Mumbai Indians).. ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌(kolkata knight Riders)పై జ‌రిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముంబై రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఈ మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌(Impact Player)గా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగాడు. ఈ మ్యాచ్‌కు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) బాధ్య‌త‌లు చేప‌ట్టాడు. సూర్య కెప్టెన్సీలోనే కేకేఆర్‌పై ముంబై విజయం సాధించింది.

ఐపీఎల్(IPL) లో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్(Mumbai Indians).. ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌(kolkata knight Riders)పై జ‌రిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముంబై రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఈ మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌(Impact Player)గా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగాడు. ఈ మ్యాచ్‌కు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) బాధ్య‌త‌లు చేప‌ట్టాడు. సూర్య కెప్టెన్సీలోనే కేకేఆర్‌పై ముంబై విజయం సాధించింది. అయితే కెప్టెన్‌గా.. తొలి మ్యాచ్‌లోనే జరిమానాను ఎదుర్కొన్నాడు. మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్(Slow Over Rate) కారణంగా సూర్యకు ఈ పెనాల్టీ(Penalty) విధించారు. ఇందుకుగాను సూర్యకు రూ.12 లక్షల జరిమానా విధించారు.

స్లో ఓవర్ రేట్ కు సంబంధించి ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం.. సూర్యకుమార్ యాదవ్‌కు ఈ సీజన్‌లో ముంబై చేసిన మొదటి త‌ప్పు కావడంతో రూ. 12 లక్షల జరిమానా విధించినట్లు ఐపీఎల్ మీడియా అడ్వైజరీ ఆదివారం తెలిపింది. కేకేఆర్‌పై ముంబై జట్టు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ లేకుండానే మైదానంలోకి దిగింది. సమాచారం ప్రకారం.. రోహిత్ శర్మకు కడుపులో కొంత సమస్య ఉందని తెలిసింది. ఈ కారణంగా అతను ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌కు కెప్టెన్సీ అప్పగించారు. ముంబై ఇన్నింగ్స్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా రోహిత్ బ్యాటింగ్‌కు వచ్చాడు.. ఈ మ్యాచ్‌లో రోహిత్ బ్యాట్ 13 బంతుల్లో 20 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో కేకేఆర్‌ని ఓడించి ఈ సీజన్‌లో రెండో విజయాన్ని నమోదు చేసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ టోర్నమెంట్‌లో మూడో ఓట‌మిని చ‌విచూసింది.

Updated On 17 April 2023 1:38 AM GMT
Yagnik

Yagnik

Next Story