టీమిండియా కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌ను కొనసాగించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కోరుకుంటోంది. ప్రపంచకప్ ముగిసిన తర్వాత ద్రవిడ్ పదవీకాలం ముగియడంతో అప్పటి వరకూ అతడికి బోర్డు ఎలాంటి కొత్త ఆఫర్ ఇవ్వలేదు.

టీమిండియా కోచ్‌(Team India Coach)గా రాహుల్ ద్రవిడ్‌(Rahul Dravid)ను కొనసాగించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కోరుకుంటోంది. ప్రపంచకప్(World Cup) ముగిసిన తర్వాత ద్రవిడ్ పదవీకాలం ముగియడంతో అప్పటి వరకూ అతడికి బోర్డు ఎలాంటి కొత్త ఆఫర్ ఇవ్వలేదు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు జాతీయ క్రికెట్ అకాడమీ (NCA) చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్(VVS Laxman) కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే.. తాజాగా ద్రవిడ్ కాంట్రాక్టు(Contract)ను పొడిగించే విష‌య‌మై బోర్డు ప్రతిపాదన చేసిన‌ట్టు తెలుస్తోంది.

ESPNcricinfo ప్రకారం.. బీసీసీఐ గత వారం ద్రవిడ్‌ను సంప్రదించింది. ఆ సమయంలో పదవీకాలం పొడిగింపుపై చర్చ జరిగింది. అయితే.. ద్రావిడ్ ఈ ఆఫర్‌ను అంగీకరించాడా లేదా అనేది ఇంకా ధృవీకరించబడలేదు. ద్రవిడ్‌ను కొనసాగించేందుకు బీసీసీఐ ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. గత రెండేళ్లలో ద్రవిడ్ రూపొందించిన నిర్మాణాన్ని బోర్డు ముందుకు తీసుకెళ్లాలనుకోవడం ఇందుకు ప్రధాన కారణం.

ద్రవిడ్ మళ్లీ కోచ్ పదవికి అంగీకరిస్తే.. అతని సహాయక కోచ్‌ల బృందం కూడా చెక్కుచెదరకుండా ఉండే అవ‌కాశం ఉంది. విక్రమ్ రాథోడ్ బ్యాటింగ్ కోచ్‌(Bating Coach Vikram Rathod)గా, పరాస్ మాంబ్రే బౌలింగ్ కోచ్‌గా, దిలీప్ ఫీల్డింగ్ కోచ్‌(Dileep)గా కొనసాగుతారు.

ద్రవిడ్ ఈ ప్రతిపాదనను అంగీకరిస్తే.. అతడి రెండవ టర్మ్‌లో మొదటిది దక్షిణాఫ్రికా(South Africa) పర్యటన. మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ టీమిండియా ఆడాల్సివుంది. డిసెంబర్ 10న టీ20 సిరీస్‌తో టూర్ ప్రారంభం కానుంది. జూన్‌లో టీ20 ప్రపంచకప్‌కు ముందు స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఉంది.

2021లో జరిగిన టీ20 ప్రపంచకప్ తర్వాత రవిశాస్త్రి స్థానంలోకి కోచ్‌గా ద్రవిడ్ వచ్చాడు. ఇటీవల జరిగిన వన్డే ప్రపంచకప్‌తో రెండేళ్ల పదవీకాలం ముగిసింది. ప్రపంచకప్‌లో భారత్‌ రన్నరప్‌గా నిలిచింది. ద్రవిడ్ కోచ్‌గా ఉన్న ఐసీసీ ఈవెంట్లలో భారత్ ప్రదర్శనను చూస్తే.. జూన్‌లో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. అంతకుముందు 2022 టీ20 ప్రపంచకప్‌లో సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓడిపోయింది.

మీడియా కథనాల ప్రకారం.. రాబోయే దక్షిణాఫ్రికా పర్యటన నిమిత్తం ద్రవిడ్‌తో పాటు అతని సహాయక సిబ్బంది అందరికీ అవ‌స‌ర‌మైన‌ పత్రాలు సిద్ధం చేసిన‌ట్లు తెలుస‌ప్తోంది. అయితే.. ద్రావిడ్ కోచ్ గా ఉంటాడ‌ని అది దీనితో నిర్ధారించ‌లేము. వీవీఎస్ లక్ష్మణ్ కోచింగ్ టీమ్ కోసం బీసీసీఐ వీసాను కూడా సిద్ధం చేసింది. ద్రవిడ్ సమాధానం కోసం బీసీసీఐ ఇంకా ఎదురుచూస్తోంది. ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు బోర్డు సిద్ధంగా ఉంది. డిసెంబర్ 6న టీ20 జట్టు దక్షిణాఫ్రికాకు వెళ్లాల్సి ఉంది. డిసెంబర్ 10, 12, 14 తేదీల్లో మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. మరో రెండు రోజుల్లో జట్టును ఎంపిక చేసే అవకాశం ఉంది.

Updated On 28 Nov 2023 11:04 PM GMT
Yagnik

Yagnik

Next Story