భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) టీమ్ ఇండియా ఆడ‌బోయే రెండు సిరీస్‌ల‌కు సంబంధించిన‌ సవరించిన షెడ్యూల్‌ను ప్రకటించింది. రెండింటిలో బోర్డు ముఖ్యమైన మార్పులు చేసింది

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) టీమ్ ఇండియా ఆడ‌బోయే రెండు సిరీస్‌ల‌కు సంబంధించిన‌ సవరించిన షెడ్యూల్‌ను ప్రకటించింది. రెండింటిలో బోర్డు ముఖ్యమైన మార్పులు చేసింది. భారత్‌-బంగ్లాదేశ్‌, భారత్‌-ఇంగ్లండ్‌ సిరీస్‌లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. భారతదేశం, బంగ్లాదేశ్ మధ్య మొదటి T20I ముందుగా 6 అక్టోబర్ 2024 న ధర్మశాలలో జరగాల్సి ఉంది, వేదిక మారి గ్వాలియర్‌లో జరుగనుంది. గ్వాలియర్‌లోని కొత్త స్టేడియం శ్రీమంత్ మాధవరావు సింధియా క్రికెట్ స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య తొలి టీ20 జరగనుంది.

ఇంగ్లండ్‌తో జరిగే తొలి, రెండో టీ20 వేదికను బోర్డు మార్చింది. తొలి టీ20 మ్యాచ్ చెన్నైలో జరగాల్సి ఉండగా.. రెండో టీ20 చెన్నైలో జ‌రుగ‌నుంది. కోల్‌కతా రెండో టీ20కి బదులుగా తొలి టీ20కి ఆతిథ్యం ఇవ్వనుంది. రిపబ్లిక్ డే దృష్ట్యా.. కోల్‌కతా పోలీసులు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌ను అభ్యర్థించడంతో మొదటి టీ20 వేదికను మార్చారు.

బంగ్లాదేశ్ భారత పర్యటన

మొదటి టెస్ట్: సెప్టెంబర్ 19 నుండి 23 వరకు - MA చిదంబరం స్టేడియం, చెన్నై

రెండవ టెస్ట్: 27 సెప్టెంబర్ నుండి అక్టోబర్ 1 వరకు - గ్రీన్ పార్క్, కాన్పూర్

మొదటి T20: అక్టోబర్ 6 – శ్రీమంత్ మాధవరావ్ సింధియా క్రికెట్ స్టేడియం, గ్వాలియర్

రెండో టీ20: అక్టోబర్ 9 – అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ

మూడో టీ20: అక్టోబర్ 12- రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్

భారత్‌లో ఇంగ్లండ్‌ పర్యటన

తొలి టీ20: జనవరి 22, కోల్‌కతా

రెండో టీ20: 25 జనవరి, చెన్నై

3వ టీ20: జనవరి 28, రాజ్‌కోట్

నాలుగో టీ20: 31 జనవరి, పూణె

ఐదో టీ20: 2 ఫిబ్రవరి, ముంబై

1వ వన్డే: ఫిబ్రవరి 6, నాగ్‌పూర్

2వ వన్డే: ఫిబ్రవరి 9, కటక్

మూడో వన్డే: ఫిబ్రవరి 12, అహ్మదాబాద్

Sreedhar Rao

Sreedhar Rao

Next Story