Battle To Continue In Court : బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఇక కోర్టులో పోరాడుతాం
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి నిరసనకు దిగిన రెజ్లర్లు.. దానిని విరమించి కోర్టులో పోరాడాలని నిర్ణయించుకున్నారు. అగ్రశ్రేణి రెజ్లర్ సాక్షి మాలిక్ ట్విట్టర్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు. కోర్టులో పోరాటం కొనసాగుతుందని ఆమె అన్నారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్(Brij Bhushan Singh)పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి నిరసనకు దిగిన రెజ్లర్లు.. దానిని విరమించి కోర్టులో పోరాడాలని నిర్ణయించుకున్నారు. అగ్రశ్రేణి రెజ్లర్ సాక్షి మాలిక్(Sakshi Malik) ట్విట్టర్(Twitter)లో ఈ విషయాన్ని ప్రకటించారు. కోర్టులో పోరాటం కొనసాగుతుందని ఆమె అన్నారు.
జూన్ 15న ప్రభుత్వంతో జరిగిన రెజ్లర్ల సమావేశంలో.. ఆదివారం నాటికి బ్రిజ్ భూషణ్ సింగ్‌పై చార్జిషీట్(Charge Sheet) దాఖలు చేస్తామని హామీ ఇచ్చారు. జూన్ 15న ఛార్జిషీట్‌ను కోర్టులో సమర్పించినందున మేము నిరసనను విరమించాలని నిర్ణయించుకున్నామని సాక్షి తెలిపింది.
‘రెజ్లింగ్ అసోసియేషన్(Wrestling Association) సంస్కరణకు సంబంధించి.. ఇచ్చిన హామీ మేరకు కొత్త రెజ్లింగ్ సంఘం ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. జూలై 11న ఎన్నికలు జరగాల్సి ఉంది, అయితే ఈ ప్రక్రియ అమలు కోసం వేచి చూస్తామని సాక్షి ప్రకటనలో రాసింది.
మరోవైపు.. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) తాత్కాలిక ప్యానెల్, క్రీడా మంత్రిత్వ శాఖ, WFIకి వ్యతిరేకంగా అస్సాం రెజ్లింగ్ అసోసియేషన్ (AWA) దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా గౌహతి హైకోర్టు(Gauhati High Court) ఆదివారం రెజ్లింగ్ బాడీ ఎన్నికలపై స్టే విధించింది. దీంతో జూలై 11న జరగాల్సిన ఎన్నికలపై సందిగ్ధత నెలకొంది.
మైనర్‌తో సహా ఏడుగురు రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలపై బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేయాలని వినేష్ ఫోగట్(Vinesh Phogat), సాక్షి మాలిక్(Sakshi Malik), బజరంగ్ పునియా(Bajrang Punia)తో సహా టాప్ ఒలింపియన్లు డిమాండ్ చేశారు.
అయితే.. నిరూపణకు ఆధారాలు లేని కారణంగా బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై మైనర్ రెజ్లర్ దాఖలు చేసిన ఫిర్యాదును రద్దు చేయాలని పోలీసులు సిఫార్సు చేశారు. తనపై రెజ్లర్లు చేసిన ఆరోపణలను సింగ్ ఖండించారు.
గత వారం, మాలిక్ భర్త, రెజ్లర్ సత్యవర్త్ కడియన్(Satyawart Kadian)ను వారి భవిష్యత్ కార్యాచరణ గురించి అడగగా.. "మేము ఈ విషయం గురించి ఇంకా చర్చిస్తున్నాము. మేము మీకు తెలియజేస్తాము" అని చెప్పాడు.
ఒక మహిళ నేతృత్వంలో డబ్ల్యూఎఫ్‌ఐ అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాలని రెజ్లర్లు సూచించారు. ఈ ప్రతిపాదనలన్నింటిని కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్(Sports Minister Anurag Thakur) ఏకగ్రీవంగా ఆమోదించారు.