Tamim Iqbal : ప్రపంచకప్‌కు ముందు బంగ్లాదేశ్‌కు షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన కెప్టెన్
బంగ్లాదేశ్ వన్డే కెప్టెన్ తమీమ్ ఇక్బాల్(Tamim Iqbal)2023లో భారత్(India)లో జరగనున్న ప్రపంచకప్(World Cup)కు మూడు నెలల ముందు హఠాత్తుగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీంతో తమీమ్ ఇక్బాల్ 16 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్ ముగిసింది. గురువారం ఛటోగ్రామ్‌లో విలేకరుల సమావేశంలో తమీమ్ ఇక్బాల్ రిటైర్మెంట్ ప్రకటించారు. బుధవారం బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓటమి పొందింది.
బంగ్లాదేశ్ వన్డే కెప్టెన్ తమీమ్ ఇక్బాల్(Tamim Iqbal)2023లో భారత్(India)లో జరగనున్న ప్రపంచకప్(World Cup)కు మూడు నెలల ముందు హఠాత్తుగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీంతో తమీమ్ ఇక్బాల్ 16 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్ ముగిసింది. గురువారం ఛటోగ్రామ్‌లో విలేకరుల సమావేశంలో తమీమ్ ఇక్బాల్ రిటైర్మెంట్ ప్రకటించారు. బుధవారం బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓటమి పొందింది. తమీమ్ ఇక్బాల్ స్థానంలో వన్డే కెప్టెన్ ను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించాల్సి వుంది. టీ20 ఇంటర్నేషనల్ ఫార్మాట్‌లో బంగ్లాదేశ్‌కు షకీబ్ అల్ హసన్ కెప్టెన్‌గా ఉండగా, టెస్టుల్లో లిటన్ దాస్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.
34 ఏళ్ల తమీమ్ ఇక్బాల్ గతేడాది అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక్బాల్ తన చివరి టెస్టు మ్యాచ్‌ని ఐర్లాండ్‌తో ఏప్రిల్‌లో ఆడాడు. తమీమ్ ఇక్బాల్ 2007లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. 2007 ప్రపంచకప్‌లో భారత్‌పై బంగ్లాదేశ్ చారిత్రాత్మక విజయంలో తమీమ్ హాఫ్ సెంచరీతో కీలక పాత్ర పోషించాడు.
బంగ్లాదేశ్ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు (8313), సెంచరీలు (14) చేసిన బ్యాట్స్‌మెన్‌గా తమీమ్ ఇక్బాల్ నిలిచాడు. టెస్టుల్లో తమీమ్ ఇక్బాల్ 70 మ్యాచ్‌ల్లో 38.89 సగటుతో 10 సెంచరీల సాయంతో 5,134 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ తరఫున అత్యధిక టెస్టు పరుగులు చేసిన రెండో ఆటగాడుగా తమీమ్ నిలిచాడు.
వన్డే కెప్టెన్సీ విషయానికొస్తే.. మష్రాఫ్ మోర్తజా కంటే తమీమ్ ఇక్బాల్ మెరుగైన విజయాల శాతాన్ని కలిగిఉన్నాడు. తమీమ్ బంగ్లాదేశ్‌కు 37 వన్డేలకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అందులో బంగ్లాదేశ్ 21 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. తమీమ్ ఇక్బాల్ నేతృత్వంలో బంగ్లాదేశ్ వన్డే సూపర్ లీగ్‌లో మూడో స్థానానికి చేరుకుంది. ప్రపంచ కప్‌కు నేరుగా అర్హత సాధించింది.