ఐపీఎల్‌-2023లో 43వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జ‌ట్ల మ‌ధ్య జ‌రిగింది. ఈ మ్యాచ్ లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. అంతేకాదు 18 పరుగుల తేడాతో మ్యాచ్‌ను కూడా ద‌క్కించుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ తొలి ఇన్నింగ్స్‌లో 126 పరుగులు చేసింది. లక్నో బ్యాట్స్‌మెన్ ఈ సులభమైన లక్ష్యాన్ని ఛేదించలేక‌ 18 పరుగుల తేడాతో మ్యాచ్‌ను కోల్పోయింది.

ఐపీఎల్‌-2023లో 43వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore)జ‌ట్ల మ‌ధ్య జ‌రిగింది. ఈ మ్యాచ్ లక్నో(Lucknow)లోని ఎకానా క్రికెట్ స్టేడియం(Ekana Cricket Stadium)లో జరిగింది. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. అంతేకాదు 18 పరుగుల తేడాతో మ్యాచ్‌ను కూడా ద‌క్కించుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ తొలి ఇన్నింగ్స్‌లో 126 పరుగులు చేసింది. లక్నో బ్యాట్స్‌మెన్ ఈ సులభమైన లక్ష్యాన్ని ఛేదించలేక‌ 18 పరుగుల తేడాతో మ్యాచ్‌ను కోల్పోయింది.

బెంగళూరు బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లి(Virat Kohli), ఫాఫ్ డుప్లేసీ(Faf Du Plessis) వచ్చారు 44 బంతుల్లో 50 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఫీల్డింగ్ సమయంలో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్(KL Rahul) గాయపడ్డాడు. రాహుల్‌ మైదానం వీడ‌టంతో అతని స్థానంలో కృనాల్ పాండ్యా(Krunal Pandya) కెప్టెన్‌గా వ్యవహరిస్తుంచాడు. 9వ ఓవర్‌లో రవి బిష్ణోయ్(Ravi Bishnoi) బౌలింగ్ రాగా.. చివరి బంతికి విరాట్ కోహ్లీ స్టంపౌట్ అయ్యాడు. కోహ్లీ 30 బంతుల్లో 31 పరుగులు చేశాడు. కెప్టెన్ డుప్లెసిస్ 40 బంతుల్లో 44 ప‌రుగులు చేశాడు. దీంతో ఆర్సీబీ 20 ఓవ‌ర్ల‌లో 126 ప‌రుగులు చేసింది.

లక్నో తరఫున కైల్ మేయర్స్(Kyle Mayors), ఆయుష్ బడోనీ(Ayush Badoni) ఓపెనింగ్‌ బ్యాటింగ్‌కు వచ్చారు. తొలి ఓవర్ రెండో బంతికి కైల్ మేయర్స్ క్యాచ్ ఔట్ అయ్యాడు. తొలి ఓవర్‌లో కేవలం 1 పరుగు మాత్రమే వచ్చింది. నాలుగో ఓవర్‌లో గ్లెన్ మాక్స్‌వెల్(Glenn Maxwell) బౌలింగ్‌కు వచ్చాడు. ఈ ఓవర్ మూడో బంతికి కృనాల్ పాండ్యా క్యాచ్ ఔట్ అయ్యాడు. పాండ్యా 11 బంతుల్లో 14 పరుగులు చేశాడు. ఆరో ఓవర్‌ వనిందు హసరంగా(Hasaranga) బౌలింగ్‌ తొలి బంతికే దీపక్ హుడా(Deepak Huda)(1) స్టంపౌట్ అయ్యాడు. ఇలా వచ్చిన బ్యాట్స్‌మెన్ వ‌చ్చిన‌ట్టు పెవిలియ‌న్‌కు క్యూ క‌ట్టారు. ఇక‌ గాయపడిన కేఎల్‌ రాహుల్ 11వ నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చినప్పటికీ ఏమీ చేయలేకపోయాడు. దీంతో అక్నో 18 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది.

Updated On 1 May 2023 10:09 PM GMT
Yagnik

Yagnik

Next Story