Punjab Kings : ఐపీఎల్‌లో పంజాబ్ సంచలనం.. టీ20 చరిత్రలోనే భారీ ఛేజింగ్..!
ఐపీఎల్ 17 ఏళ్ల హిస్టరీలో పంజాబ్ కింగ్స్ ఎవరికీ సాధ్యం కానీ రికార్డును తన పేరిట లిఖించుకుంది. పంజాబ్, కేకేఆర్‌ల మధ్య ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో కొత్త చరిత్ర లిఖించబడింది.
ఐపీఎల్ 17 ఏళ్ల హిస్టరీలో పంజాబ్ కింగ్స్ ఎవరికీ సాధ్యం కానీ రికార్డును తన పేరిట లిఖించుకుంది. పంజాబ్, కేకేఆర్‌ల మధ్య ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో కొత్త చరిత్ర లిఖించబడింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. కోల్‌కతా జట్టులో సాల్ట్(75), నరైన్(71), వెంకటేశ్ అయ్యర్(39) పరుగులతో రాణించారు. కోల్‌కతా నిర్దేశించిన లక్ష్యాన్ని పంజాబ్ బ్యాట్స్‌మెన్ చాలా ధైర్యంగా ఛేదించారు. మ్యాచ్‌లో పంజాబ్ 262 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి చరిత్ర సృష్టించింది. ఐపీఎల్‌లోనే కాదు.. ఇది టీ20 క్రికెట్‌లో ఇదే అతిపెద్ద లక్ష్య చేధన కావడం విశేషం.
262 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌కు ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జానీ బెయిర్‌స్టో శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 6 ఓవర్లలో 93 పరుగులు జోడించారు. ప్రభ్‌సిమ్రన్ 20 బంతుల్లో 54 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ప్రభ్‌సిమ్రన్ పెవిలియన్‌కు చేరిన తర్వాత బెయిర్‌స్టో బాధ్యతలు స్వీకరించి 23 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత బెయిర్‌స్టో 45 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. మ్యాచ్ ముగిసే సమయానికి 48 బంతులు ఎదుర్కొని 108 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో బెయిర్‌స్టో 8 ఫోర్లు, 9 సిక్సర్లు బాదాడు.
బెయిర్‌స్టోకు మరో ఎండ్ నుంచి శశాంక్ సింగ్ నుంచి మంచి మద్దతు లభించింది. శశాంక్ పంజాబ్ బౌలర్‌లపై విరుచుకుపడ్డాడు. శశాంక్ 28 బంతులు మాత్రమే ఆడి 68 పరుగులు చేశాడు. 242 స్ట్రైక్ రేట్‌తో 2 ఫోర్లు, 8 సిక్సర్‌లు కొట్టాడు.
పంజాబ్ కంటే ముందు టీ20లలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 259 పరుగుల లక్ష్యం చేధించి విజయాన్ని సాధించింది. ఐపీఎల్‌లో 2020 సంవత్సరంలో పంజాబ్‌పై 224 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ ఛేజ్ చేసింది.