పీవీ సింధు తన కెరీర్‌లో రెండు ఒలింపిక్ పతకాలు సాధించి, దేశానికి గర్వకారణంగా నిలిచారు.

భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు(PV Sindhu) తన సుదీర్ఘకాల స్నేహితుడు, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త వెంకట దత్త(venkata datta) సాయితో వివాహ బంధంలో అడుగుపెట్టారు. ఈ వివాహం 2024 డిసెంబర్ 22న ఉదయపూర్‌లోని రాఫెల్స్ రిసార్ట్‌లో అంగరంగ వైభవంగా జరిగింది.


వివాహ వేడుకలు మూడు రోజుల పాటు జరగగా, సంగీత్, హల్దీ, పెళ్లికూతురు కార్యక్రమాలు, బ్రిడ్జర్టన్-ప్రేరణతో మెహందీ, వర్మాల తదితర సాంప్రదాయ వేడుకలు నిర్వహించాయి. ఈ వేడుకలన్నీ విశేషంగా ఆకట్టుకోగా, ప్రత్యేక అలంకరణలు, దుస్తులు మరింత అందాన్నిచ్చాయి.


సింధు వర్మాల కార్యక్రమంలో సబ్యసాచీ(sabyasachi) డిజైన్ చేసిన దుస్తులను, వివాహంలో మనీష్ మల్హోత్(Manish malhothra)రా రూపొందించిన దుస్తులను ధరించారు.


వివాహం తర్వాత, డిసెంబర్ 24న హైదరాబాద్‌లో(Hyderabad) గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించగా, దానికి సుమారు 7,000 మంది అతిథులు హాజరయ్యారు. ఈ రిసెప్షన్ అనంతరం తిరుపతి, పద్మావతి దేవాలయాలను సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.


పీవీ సింధు మరియు వెంకట దత్త సాయి ప్రేమకథ 2022లో ఒక విమాన ప్రయాణంలో మొదలైంది. ఆ పరిచయం స్నేహంగా మారి, తర్వాత అది ప్రేమలోకి మారింది. 2024 డిసెంబర్ ప్రారంభంలో నిశ్చితార్థం జరిపి, నెలాఖరులో వివాహం చేసుకున్నారు.


పీవీ సింధు తన కెరీర్‌లో రెండు ఒలింపిక్ పతకాలు సాధించి, దేశానికి గర్వకారణంగా నిలిచారు. ఇటీవల ఆమె సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టైటిల్‌ను కూడా గెలుచుకున్నారు.


ఈ కొత్త దంపతులకు భవిష్యత్తులో సుఖసంతోషాలు నిండిన జీవితం అందాలని మనం ఆశిద్దాం.


ఈ కొత్త దంపతులకు భవిష్యత్తులో సుఖసంతోషాలు నిండిన జీవితం అందాలని మనం ఆశిద్దాం.




Eha Tv

Eha Tv

Next Story