Babar Azam : ధోనీ-రోహిత్‌లను దాటేశాడు.. ప్రపంచ రికార్డుకు అడుగుదూరంలో బాబర్ ఆజం
పాకిస్థాన్ పరిమిత ఓవర్ల కెప్టెన్ బాబర్ ఆజం శనివారం చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా బాబర్ ఆజం నిలిచాడు.
పాకిస్థాన్ పరిమిత ఓవర్ల కెప్టెన్ బాబర్ ఆజం శనివారం చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా బాబర్ ఆజం నిలిచాడు. గత నెలలో బాబర్ ఆజం మళ్లీ పాకిస్థాన్ కెప్టెన్‌గా నియమించబడ్డాడు. బాబర్ నవంబర్ 2023లో అన్ని ఫార్మాట్లకు కెప్టెన్ పదవికి రాజీనామా చేశాడు.
బాబర్ అజామ్ 76 మ్యాచ్‌ల్లో పాక్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి 44 మ్యాచ్‌ల్లో విజయం సాధించాడు. తద్వారా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ రికార్డును బాబర్ ఆజం సమం చేశాడు. ఇయాన్ మోర్గాన్ టీ20 ఇంటర్నేషనల్ ఫార్మాట్‌లో 72 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించి 44 విజయాలు అందించాడు.
శనివారం న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో, చివరి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా బాబర్ అజామ్ ప్రపంచ రికార్డును సమం చేశాడు. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 9 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి సిరీస్‌ను 2-2తో సమం చేసింది.
ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో అరంగేట్రం చేయనున్న ఉగాండా జట్టు కూడా ఈ జాబితాలో చేరింది. బ్రియాన్ మసాబా 56 మ్యాచ్‌ల్లో 44 విజయాలు అందించాడు. భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ 72 మ్యాచ్‌ల్లో 42 విజయాలు కట్టబెట్టాడు. భారత ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ 54 మ్యాచ్‌ల్లో 42 విజయాలు అందించాడు. ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన అస్గర్ ఆఫ్ఘన్ 52 మ్యాచ్‌ల్లో 42 విజయాలు కట్టబెట్టాడు.