Unbelievable : 2 ఓవర్లో 61 పరుగులు చేస్తే విజయం.. అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు..!
క్రికెట్ గేమ్‌లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. మ్యాచ్ చివరి బంతి కూడా మలుపు తిరిగిన సందర్భాలు ఉన్నాయి
క్రికెట్ గేమ్‌లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. మ్యాచ్ చివరి బంతి కూడా మలుపు తిరిగిన సందర్భాలు ఉన్నాయి. ఒక క్యాచ్ మ్యాచ్ గతినే మార్చిన సందర్భాలు ఎన్నో.. ఇటీవల.. యూరోపియన్ క్రికెట్ T10 టోర్నమెంట్‌లో ఇలాంటి ఓ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రియా జట్టు ఒక బంతి మిగిలి ఉండగానే అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది.
రొమేనియాపై 168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఆస్ట్రియా జట్టుకు మొదటి 8 ఓవర్ల తర్వాత ఓటమి దాదాపు ఖాయమైంది. చివరి రెండు ఓవర్లలో జట్టు విజయానికి 61 పరుగులు అవసరం కాగా.. ఈ ఒత్తిడి తట్టుకుని ఆస్ట్రియా ఒక బంతి మిగిలి ఉండగానే 61 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో మ్యాచ్‌ను గెలుచుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన రొమేనియా జట్టు 167 పరుగులు చేసింది. బదులుగా 168 పరుగుల ఛేదనకు దిగిన ఆస్ట్రియా జట్టు ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. ఇక్బాల్ 9 బంతుల్లో 22 పరుగులతో, ఇమ్రాన్ 14 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. 9వ ఓవర్‌లో మన్మీత్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు. తన రెండు ఓవర్ల కోటాలో 57 పరుగులు ఇచ్చిన మన్మీత్ కోలీ.. మ్యాచ్ తొమ్మిదో ఓవర్లో 41 పరుగులు ఇచ్చాడు. వాటిలో 9 ఎక్స్‌ట్రాలు ఉన్నాయి. దీంతో మ్యాచ్ ఆస్ట్రియా వైపు వెళ్లింది.
ఆస్ట్రియా జట్టు రొమేనియా పేలవమైన బౌలింగ్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకుంది. చివరి రెండు ఓవర్లలో రొమేనియా 61 పరుగులు చేసిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. యూరప్ క్రికెట్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Austria chase 6️⃣1️⃣ runs in last 2 overs! 🤯#EuropeanCricket #EuropeanCricketInternational #StrongerTogether pic.twitter.com/Y8bLptmT56
— European Cricket (@EuropeanCricket) July 15, 2024