మరో రెండు వారాల్లో ప్రపంచకప్‌ జరగనున్న నేపథ్యంలో భారత్‌ ఆస్ట్రేలియాతో త‌ల‌ప‌డ‌నుంది. ఆసియా కప్ టైటిల్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు పూర్తి ఉత్సాహంతో ఆస్ట్రేలియాతో పోరాటానికి సిద్ధ‌మైంది.

మరో రెండు వారాల్లో ప్రపంచకప్‌(World Cup) జరగనున్న నేపథ్యంలో భారత్‌(India), ఆస్ట్రేలియా(Australia)తో త‌ల‌ప‌డ‌నుంది. ఆసియా కప్(Asia Cup) టైటిల్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు పూర్తి ఉత్సాహంతో ఆస్ట్రేలియాతో పోరాటానికి సిద్ధ‌మైంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌(One Day Series)లో పటిష్ట ప్రదర్శన చేయడం ద్వారా ప్రపంచకప్‌కు ముందు తమ బలాన్ని పరీక్షించుకోవాలనుకుంటోంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి మ్యాచ్ మొహాలీ(Mohali) వేదికగా శుక్ర‌వారం జరగనుంది.

మొహాలీలోని IS బృందా క్రికెట్ స్టేడియం(IS Brinda Cricket Stadium)లో దాదాపు 54 నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్(International Cricket Match) జ‌రుగుతుంది. ఈ స్టేడియంలో వన్డే మ్యాచ్ జ‌రిగి 4 సంవత్సరాలు దాటింది. ఈ మైదానంలో చివరి ODI అంతర్జాతీయ మ్యాచ్ కూడా 10 మార్చి 2019న భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగ‌డం విశేషం.

IS బింద్రా క్రికెట్ స్టేడియం బ్యాట్స్‌మెన్‌(Batsman)కు స్వ‌ర్గ‌ధామంగా ప‌రిగ‌ణించ‌బ‌డుతుంది. ఈ స్టేడియంలో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిసే అవ‌కాశం ఉంది. అయితే.. ఫాస్ట్ బౌలర్లకు కాస్తా క‌లిసొచ్చే అవ‌కాశం ఉంది. ఇక్క‌డ పాస్ట్ బౌల‌ర్లు కొంత‌ సీమ్, స్వింగ్ ద్వారా ల‌బ్దీ పొందవచ్చు. ఇక్కడ జ‌రిగిన‌ గత ఐదు వన్డేల్లో స్పిన్నర్ల కంటే ఫాస్ట్ బౌలర్లే ఎక్కువ వికెట్లు తీశారు.

ఇక్క‌డ ప్రారంభంలో జాగ్రత్తగా ఆడే బ్యాట్స్‌మెన్ తర్వాత వేగంగా పరుగులు చేస్తారు. మ్యాచ్‌లో టాస్(Toss) కీలక పాత్ర పోషిస్తుంది. టాస్ గెలిచిన జట్లు బౌలింగ్ ఎంచుకుంటాయి. సగటు మొదటి ఇన్నింగ్స్ స్కోరు 238. 2019లో ఈ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడినప్పుడు టీమ్ ఇండియా(Teamindia) ఓటమిని చవిచూసింది. ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ఆ ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

Updated On 21 Sep 2023 8:59 PM GMT
Yagnik

Yagnik

Next Story