ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైన‌ల్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 209 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 469 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా టీమిండియా 296 పరుగులకే కుప్పకూలడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 173 పరుగుల ఆధిక్యం సాధించింది. ఆస్ట్రేలియా 270 పరుగులకు రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి భారత్ ముందు 444 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్(World Test Championship) ఫైన‌ల్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 209 పరుగుల తేడాతో భారత్‌(India)పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా(Australia) తొలి ఇన్నింగ్స్‌లో 469 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా టీమిండియా 296 పరుగులకే కుప్పకూలడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 173 పరుగుల ఆధిక్యం సాధించింది. ఆస్ట్రేలియా 270 పరుగులకు రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి భారత్ ముందు 444 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు 234 పరుగులకే కుప్పకూలి.. 209 పరుగుల తేడాతో ఓడిపోయింది.

ఆస్ట్రేలియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో 209 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి ఐసీసీ ట్రోఫీలన్నీ గెలిచిన తొలి జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. అదే సమయంలో టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు వరుసగా రెండోసారి ఫైనల్‌లో ఓటమి ఎదురైంది. ఈ ఓటమితో భారత్‌ ఐసీసీ ట్రోఫీ క‌ల క‌ల‌లాగే మిగిలిపోయింది. గత పదేళ్లలో టీమ్ ఇండియా ఏ ఐసీసీ ట్రోఫీని గెలవలేదు. 2013లో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy)ని గెలుచుకుంది.

ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకోవడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 469 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ల‌లో ట్రావిస్ హెడ్(Travis Head) 163, స్టీవ్ స్మిత్(Steave Smith) 121 పరుగులు చేశారు. మొద‌టి ఇన్నింగ్సులో భారత జట్టు 296 పరుగులకే ఆలౌటైంది. భార‌త బ్యాట్స్‌మెన్ల‌లో అజింక్యా రహానే(Ajinkya Rahane) 89, శార్దూల్ ఠాకూర్(Shardul Thakur) 51, రవీంద్ర జడేజా(Ravindra Jadeja) 48 పరుగులు చేసి ఫాలోఆన్ నుంచి భారత జట్టును కాపాడారు. అనంత‌రం ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్‌ను ఎనిమిది వికెట్లు కోల్పోయి 270 పరుగుల వ‌ద్ద‌ డిక్లేర్ చేసింది. అలెక్స్ కారీ(Alex Carey) అజేయంగా 66 పరుగులు చేశాడు. పాట్ కమిన్స్(Pat Cummins), మార్నస్ లబుషెన్ చెరో 41 పరుగులు చేశారు. దీంతో భారత్ ఎదుట‌ 444 పరుగుల లక్ష్యం ఉంది. రెండో ఇన్నింగ్సు ఆరంభించిన‌ భారత జట్టు 234 పరుగులకే కుప్పకూలింది. విరాట్ కోహ్లీ(Virat Kohli) అత్యధికంగా 49 పరుగులు చేశాడు. అజింక్య రహానే 46, రోహిత్ 43 పరుగులు చేశారు. దీంతో ఫైన‌ల్‌ మ్యాచ్‌లో టీమిండియా 209 పరుగుల తేడాతో ఓడిపోయింది.

ఓవ‌రాల్‌గా ఆస్ట్రేలియా తరఫున మిచెల్ స్టార్క్ నాలుగు, పాట్ కమిన్స్ నాలుగు, స్కాట్ బోలాండ్ ఐదు వికెట్లు, కెమెరాన్ గ్రీన్ రెండు వికెట్లు, నాథన్ లియాన్ ఐదు వికెట్లు తీశారు. భారత్ తరఫున రెండు ఇన్నింగ్సుల‌లో క‌లిపి మహ్మద్ షమీ(Mohammad Shami) నాలుగు, మహ్మద్ సిరాజ్(Mohammad Siraj) ఐదు, ఉమేష్ యాదవ్(Umesh Yadav) రెండు, శార్దూల్ ఠాకూర్ రెండు, రవీంద్ర జడేజా(Ravindra Jadeja) నాలుగు వికెట్లు తీశారు.

Updated On 11 Jun 2023 7:04 AM GMT
Yagnik

Yagnik

Next Story