ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో మ్యాచ్ జరిగింది. గౌహతిలోని బర్సపరా స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. ఆస్ట్రేలియా కెప్టెన్ మాథ్యూ వేడ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.

ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్(India), ఆస్ట్రేలియా(Australia) మధ్య మూడో మ్యాచ్ జరిగింది. గౌహతిలోని బర్సపరా స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. ఆస్ట్రేలియా కెప్టెన్ మాథ్యూ వేడ్(Mathew Wade) టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 222 పరుగులు చేసింది. బ‌దులుగా ఆఖరి బంతికి ఆస్ట్రేలియా ల‌క్ష్యాన్ని చేధించింది.

మూడో టీ20లో ఆస్ట్రేలియా ఐదు వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. రితురాజ్ గైక్వాడ్(Ruthuraj Gaikwad) 57 బంతుల్లో 123 పరుగులతో టీ20ల్లో తొలి సెంచ‌రీ న‌మోదు చేశాడు. అయితే ఆస్ట్రేలియా విజ‌యానికి చివరి ఓవర్‌లో 21 పరుగులు కావాల్సివుండ‌గా.. చివ‌రి ఓవ‌ర్ వేసిన‌ ప్రసిద్ధ్ కృష్ణ(Prasiddh Krishna) అడ్డుకోలేక‌పోయాడు. మ్యాక్స్‌వెల్‌(Maxwell), వేడ్‌లు చాలా పరుగులు చేసి ఆస్ట్రేలియాను విజయతీరాలకు చేర్చారు.

చివరి ఓవర్ తొలి బంతికి వేడ్ ఫోర్ కొట్టాడు. ఆ తర్వాత రెండో బంతికి ఒక్క పరుగు వచ్చింది. ఆ తర్వాత మూడో బంతికి మ్యాక్స్‌వెల్‌ సిక్సర్‌ బాదాడు. ఆ తర్వాత నాలుగో బంతికి ఫోర్ కొట్టాడు. ఐదో బంతికి ఫోర్ కొట్టి మ్యాక్స్‌వెల్ అంతర్జాతీయ టీ20లో నాలుగో సెంచరీ పూర్తి చేశాడు. 47 బంతుల్లో సెంచరీ సాధించాడు. చివరి బంతికి ఆస్ట్రేలియాకు రెండు పరుగులు అవసరం కాగా మ్యాక్స్‌వెల్ ఫోర్ కొట్టి తన జట్టుకు విజయాన్ని అందించాడు. మ్యాక్స్‌వెల్ 48 బంతుల్లో 104 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మాథ్యూ వేడ్ 16 బంతుల్లో 28 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు.

మ్యాక్స్‌వెల్ ఇప్పుడు రోహిత్ శర్మ(Rohit Sharma)తో పాటు టీ20 ఇంటర్నేషనల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియా పునరాగమనం చేసింది. సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది. సిరీస్‌లో నాలుగో మ్యాచ్ డిసెంబర్ 1న రాయ్‌పూర్‌లో జరగనుంది.

Updated On 28 Nov 2023 10:09 PM GMT
Yagnik

Yagnik

Next Story