Australia Announce Squad For WTC 2023 Final : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో టీమిండియాతో తలపడే ఆస్ట్రేలియా టీమ్ ఇదే..!
ఐపీఎల్-2023 తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు టీమిండియాతో తలపడనుంది. గతేడాది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన టీమిండియా.. ఈ ఏడాది ఆస్ట్రేలియాను ఓడించి టైటిల్ గెలవాలని భావిస్తోంది.

Australia Announce 17-Man Squad For WTC 2023 Final vs India
ఐపీఎల్-2023 తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్(WTC 2023 Final) మ్యాచ్ జరగనుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా(Australia) జట్టు టీమిండియాతో తలపడనుంది. గతేడాది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో న్యూజిలాండ్(Newzealand) చేతిలో ఓడిన టీమిండియా.. ఈ ఏడాది ఆస్ట్రేలియాను ఓడించి టైటిల్ గెలవాలని భావిస్తోంది. ఇదిలావుంటే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది.
భారత పర్యటనలో తొలి రెండు టెస్టుల అనంతరం స్వదేశానికి చేరుకున్న పాట్ కమిన్స్(Pat Cummins).. మరోసారి ఆస్ట్రేలియా జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ (World Test Championship Final) లో కమిన్స్ ఆస్ట్రేలియా జట్టుకు నాయకత్వం వహించబోతున్నాడు. తర్వాత యాషెస్ సిరీస్(Ashes 2023)లో ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో జట్టు వైస్ కెప్టెన్సీని స్టీవ్ స్మిత్‌కు అప్పగించారు. స్మిత్ ఇటీవలే భారత పర్యటనలో రెండు మ్యాచ్‌లకు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు.
ఈ భారీ మ్యాచ్‌కు ముందు చాలామంది స్టార్ ఆటగాళ్లు ఆస్ట్రేలియా జట్టులోకి వచ్చారు. ఆస్ట్రేలియా బౌలింగ్ విషయానికి స్కాట్ బోలాండ్(Scot Boland), జోస్ హాజిల్‌వుడ్(Josh Hazlewood), జోస్ ఇంగ్లిస్, నాథన్ లియోన్, టాడ్ మర్ఫీ వంటి ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. మిచెల్ మార్ష్(Mitchell Marsh), కామెరాన్ గ్రీన్(Cameron Green) రూపంలో ఇద్దరు ఆల్ రౌండర్లు కూడా జట్టులో చేరనున్నారు. ఆస్ట్రేలియా ప్రధాన బౌలర్ మిచెల్ స్టార్క్(Mitchell Stark) బౌలింగ్ లైనప్‌కు నాయకత్వం వహించనున్నాడు.
బ్యాటింగ్‌ను పరిశీలిస్తే.. స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మ్యాట్ రాన్‌షా, మార్కస్ హారిస్, డేవిడ్ వార్నర్‌లకు జట్టులో చోటు దక్కింది. వికెట్ కీపర్ అలెక్స్ కారీ కొనసాగనున్నాడు.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ఆస్ట్రేలియన్ జట్టు:
పాట్ కమిన్స్ (సి), స్టీవ్ స్మిత్ (విసి), డేవిడ్ వార్నర్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ(వీకే), కెమెరాన్ గ్రీన్, మార్కస్ హారిస్, జోస్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోస్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే, నాథన్ లియోన్, మిచెల్ మార్ష్, టాడ్ మర్ఫీ, మాథ్యూ రెన్షా, మిచెల్ స్టార్క్.
