ప్రపంచ కప్ 2023లో సోమ‌వారం జ‌రిగిన మ్యాచ్‌లో ఐదుసార్లు ఛాంపియన్ అయిన‌ ఆస్ట్రేలియా.. శ్రీలంకపై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. లక్నోలోని ఎకానా స్టేడియంలో జ‌రిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకుని

ప్రపంచ కప్(World CUp) 2023లో సోమ‌వారం జ‌రిగిన మ్యాచ్‌లో ఐదుసార్లు ఛాంపియన్ అయిన‌ ఆస్ట్రేలియా(Australia).. శ్రీలంక(Sri Lanka)పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. లక్నో(Lucknow)లోని ఎకానా స్టేడియం(Ekana Stadium)లో జ‌రిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకుని 43.3 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఆస్ట్రేలియా 35.2 ఓవర్లలో ఐదు వికెట్లకు 215 పరుగులు చేసి విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తరఫున ఇద్దరు బ్యాట్స్‌మెన్ హాఫ్ సెంచరీలు ఆడారు. జోష్ ఇంగ్లీష్(Josh Inglish) అత్యధిక స్కోరు 58 పరుగులు చేయ‌గా.. మిచెల్ మార్ష్(Mitchell Marsh) 52 పరుగులు చేశాడు. మార్షన్ లాబుషాగ్నే 40 పరుగులు చేసి.. ఇంగ్లిష్‌తో నాలుగో వికెట్‌కు 77 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును విజయానికి చేరువ చేశాడు. గ్లెన్ మాక్స్‌వెల్(Glenn Maxwell) 31 పరుగులతో, మార్కస్ స్టోయినిస్(Marcus Stoinis) 20 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. డేవిడ్ వార్నర్ 11 పరుగుల వద్ద ఔటయ్యాడు. స్టీవ్ స్మిత్(Steave Smith) ఖాతా తెరవకుండానే అవుట‌య్యాడు. శ్రీలంక తరఫున దిల్షాన్ మధుశంక మూడు వికెట్లు పడగొట్టాడు. దునిత్ వెలలాగే ఒక వికెట్‌ సాధించాడు.

అంత‌కుముందు బ్యాటింగ్‌కు దిగిన లంక జట్టు మంచి శుభారంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. తొలి వికెట్‌కు 125 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన కుశాల్ పెరీరా(Kushal Perera), పాతుమ్ నిస్సాంక లంకకు బలమైన ఆరంభాన్ని అందించారు. 61 పరుగుల వద్ద నిస్సాంక ఔటయ్యాడు. అతని తర్వాత కుశాల్ మెండిస్ 78 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. వీరిద్దరూ ఔటైన తర్వాత లంక జట్టు తడబడి 209 పరుగులకే కుప్పకూలింది. ఆస్ట్రేలియా తరఫున లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా(Adam Zampa) అత్యధికంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. మిచెల్ స్టార్క్(Mitchell Stark), పాట్ కమిన్స్(Pat Cummins) చెరో రెండు వికెట్లు తీయ‌గా.. గ్లెన్ మాక్స్‌వెల్ ఒక వికెట్ తీశాడు.

Updated On 16 Oct 2023 9:44 PM GMT
Yagnik

Yagnik

Next Story