Virat Kohli : మగబిడ్డకు జన్మనిచ్చిన విరాట్ కోహ్లీ భార్య..!
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ఇంట్లో సంతోషం వెల్లివెరిసింది. విరాట్ భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ మగబిడ్డకు జన్మనిచ్చింది.

nushka Shama Gave Birth To Baby Boy Virat Kohli Shared A Post On Instagram
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ఇంట్లో సంతోషం వెల్లివెరిసింది. విరాట్ భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో కింగ్ కోహ్లీ మరోసారి తండ్రి అయ్యాడు. ఈ విషయాన్ని కోహ్లీ మంగళవారం తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తెలియజేశాడు. విరాట్ కోహ్లీ తన ఇన్‌స్టా హ్యాండిల్ ద్వారా ఫిబ్రవరి 15న తన భార్య కొడుకు 'ఏకే' కు జన్మనిచ్చిందని చెప్పాడు.
విరాట్ ఆ పోస్ట్‌లో ఇలా వ్రాశాడు, "ఫిబ్రవరి 15 న మేము మా కొడుకు 'ఏకే' కు వామికా తన తమ్ముడికి ఈ ప్రపంచంలోకి స్వాగతించామని పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా జీవితంలోని ఈ ఆనందమైన సమయంలో మేము మీ ఆశీర్వాదాలు, శుభాకాంక్షలు కోరుకుంటున్నాము. అలాగే మా గోప్యతను గౌరవించడని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నామని పోస్ట్ చేశాడు. ఈ పోస్టుకు క్రికెట్ ప్రముఖులందరితోపాటు అభిమానులు కూడా అతనికి శుభాకాంక్షలు చెప్పడం ప్రారంభించారు.
