అమూల్ పాల ధరలు మరోసారి పెంచారు. గుజరాత్ అంతటా

అమూల్ పాల ధరలు మరోసారి పెంచారు. గుజరాత్ అంతటా అమూల్ పాల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అమూల్‌ కింద పాల ఉత్పత్తులను విక్రయిస్తున్న గుజరాత్‌ కోఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ (జీసీఎంఎంఎఫ్‌) రాష్ట్రవ్యాప్తంగా పాల ధరలను రూ.2 పెంచింది. కొత్త ధరలు జూన్ 3 నుండి అమలులోకి రానున్నాయి. GCMMF ధరల పెరుగుదలను ప్రస్తావిస్తూ అధికారిక నోట్‌ను విడుదల చేసింది. పెరిగిన ధరలు కేవలం 3-4 శాతం మాత్రమేనని, ఆహార ద్రవ్యోల్బణం కంటే చాలా తక్కువని అమూల్ సంస్థ వివరణ ఇచ్చింది.

అమూల్ బ్రాండ్ నుండి అమ్మే.. వేరియంట్‌లు, అమూల్ గోల్డ్, అమూల్ శక్తి, అమూల్ టీ లాంటి స్పెషల్ మిల్క్‌ ధరలు కూడా లీటరుకు రూ. 2 చొప్పున పెరిగాయి. అమూల్ గోల్డ్ ఇప్పుడు లీటరు రూ.66 కాగా.. అమూల్ టీ స్పెషల్ లీటర్ ధర రూ.62 నుండి రూ.64 కు పెరిగింది. అమూల్ శక్తి లీటర్ రూ.62కి అందుబాటులో ఉంది. అమూల్ సంస్థ పెరుగు ధర కూడా కాస్త పెరిగింది.

Updated On 2 Jun 2024 8:59 PM GMT
Yagnik

Yagnik

Next Story