LSG vs SRH : కెప్టెన్ మార్క్‌రామ్ వచ్చినా మనోళ్లకు విజయం దక్కలే.. సన్‌రైజర్స్‌కు వరుసగా రెండో ఓటమి.!
ఐపీఎల్-2023లో భాగంగా శక్రవారం లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants), సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఐడెన్ మార్క్‌రామ్(Aiden Markram) టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆ నిర్ణయం పూర్తిగా తప్పు అని తేలింది. ఈ మ్యాచ్ లక్నోలోని ఎకానా స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో లక్నో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ జట్టు 121 పరుగులు మాత్రమే […]
ఐపీఎల్-2023లో భాగంగా శక్రవారం లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants), సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఐడెన్ మార్క్‌రామ్(Aiden Markram) టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆ నిర్ణయం పూర్తిగా తప్పు అని తేలింది. ఈ మ్యాచ్ లక్నోలోని ఎకానా స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో లక్నో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ జట్టు 121 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం లక్నో జట్టు 16 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసి సులువుగా లక్ష్యాన్ని ఛేదించింది.
ఈ మ్యాచ్‌లో ఛేజింగ్‌కు దిగిన లక్నో జట్టు 45 పరుగులకే కైల్ మేయర్స్(Kyle Mayers), దీపక్ హుడా(Deepak Hooda)ల వికెట్లు కోల్పోయింది. అనంతరం కృనాల్ పాండ్యా (34) కేఎల్ రాహుల్ (35) లు నెమ్మదిగా ఆడుతూ.. మ్యాచ్ ను లక్నో వైపుకు మలుచుకున్నారు. సన్‌రైజర్స్ బౌలర్లలో ఆదిల్ రషీద్ 2 వికెట్లు తీశాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 8 వికెట్ల నష్టానికి 121 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ అన్మోల్‌ప్రీత్ సింగ్ 31 పరుగులు చేశాడు. రాహుల్ త్రిపాఠి కూడా పర్వాలేదనిపించాడు. 35 పరుగులు చేసి గౌరవప్రదమైన స్కోరు చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. చివర్లో అబ్దుల్ సమద్ 21 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్యా 3 వికెట్లు పడగొట్టగా.. అమిత్ మిశ్రా 2 వికెట్లు తీశాడు.
ఇదిలావుంటే.. కెప్టెన్ మారినా సన్‌రైజర్స్ జట్టు గాడిలోపడలేదు. ఐపీఎల్- 2022 సీజన్‌లో కేన్ విలియమ్సన్ ఆ జట్టుకు కెప్టెన్. అతను ప్లేఆఫ్ దశకు జట్టును తీసుకెళ్లలేకపోయాడు. దీంతో సన్‌రైజర్స్ ఐపీఎల్-2023 కి విలియమ్సన్‌ను ఉంచుకోలేదు. అప్పటి నుండి ఈ ఫ్రాంచైజీ కొత్త కెప్టెన్ కోసం వెతుకుతోంది. ఐపీఎల్-2023 కోసం వేలంలో సన్‌రైజర్స్ మయాంక్ అగర్వాల్‌ను కొనుగోలు చేసింది. అగర్వాల్ ఎస్ఆర్‌హెచ్ బాధ్యతలు తీసుకుంటారని అంతా అనుకున్నారు. అయితే అనూహ్యంగా టీమ్ పగ్గాలు మార్క్‌రామ్ చేతికి అప్పగించింది టీమ్ మేనేజ్‌మెంట్. చూద్దాం.. కెప్టెన్ గా తొలి మ్యాచ్ ఓటమి ఓటమితో మొదలుపెట్టిన ఐడెన్ మార్క్‌రామ్ జట్టును విజయతీరాలకు చేర్చుతాడో.. లేదో..!