India Women vs England Women : తొలి టీ20లో టీమిండియా ఓటమి
భారత్, ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభమైంది. ప్రతిష్టాత్మక సిరీస్‌లో మొదటి మ్యాచ్ బుధవారం వాంఖడే స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ మహిళల జట్టు విజయం సాధించింది
భారత్(India), ఇంగ్లండ్(England) మహిళల క్రికెట్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభమైంది. ప్రతిష్టాత్మక సిరీస్‌లో మొదటి మ్యాచ్ బుధవారం వాంఖడే స్టేడియం(Whankhade Stadium)లో జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ మహిళల జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 197 పరుగులు చేయగలిగింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత మహిళల జట్టు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లిష్ మహిళల జట్టు 38 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఇంగ్లండ్ జట్టులో నాట్ స్కివర్ బ్రంట్, డానీ వ్యాట్ హాఫ్ సెంచరీలతో రాణించారు. జట్టు తరఫున నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన బ్రంట్ 53 బంతుల్లో 77 పరుగులతో హాఫ్ సెంచరీ చేసింది. ఇన్నింగ్స్ ప్రారంభించిన వ్యాట్ 47 బంతుల్లో 75 పరుగులు చేసింది. ఈ ఇద్దరు కాకుండా ఆరో స్థానంలో బ్యాటింగ్ చేసిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ అమీ జోన్స్ తొమ్మిది బంతుల్లో 23 పరుగులు చేసింది. రేణుకా సింగ్(Rennuka Singh) భారత్ తరుపున నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి 27 పరుగులుఇచ్చి మూడు వికెట్లు తీసింది. శ్రేయాంక పాటిల్(Shreyanka Patil) రెండు వికెట్లు, సైకా ఇషాక్ ఒక వికెట్ పడగొట్టారు.
లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో షెఫాలీ వర్మ(Shefali Varma) టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఆమె 42 బంతులు ఎదుర్కొని 52 పరుగులతో అర్ధ సెంచరీ ఇన్నింగ్స్ ఆడింది. షెఫాలీతో పాటు కెప్టెన్ కౌర్ 21 బంతుల్లో 26 పరుగులు చేసింది. మిగతా బ్యాట్స్‌మెన్‌లు అంతా విఫలమయ్యారు. ఇంగ్లీష్ మహిళల జట్టు తరపున సోఫీ ఎక్లెస్టోన్ నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి 15 పరుగులు ఇచ్చి గరిష్టంగా మూడు వికెట్లు పడగొట్టింది. వీరితో పాటు ఫ్రెయా కెంప్, సారా గ్లెన్, నాట్ స్కివర్ బ్రంట్ ఒక్కో వికెట్ తీశారు.