మూడు వన్డేల సిరీస్‌ను ఆస్ట్రేలియా విజయంతో ముగించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన తర్వాత మూడో, చివరి మ్యాచ్‌లో 66 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. టీమ్ ఇండియా 2-1తో సిరీస్‌ని కైవసం చేసుకుంది.

మూడు వన్డేల సిరీస్‌ను ఆస్ట్రేలియా(Australia) విజయంతో ముగించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన తర్వాత మూడో, చివరి మ్యాచ్‌లో 66 పరుగుల తేడాతో భారత్‌(India)ను ఓడించింది. టీమ్ ఇండియా 2-1తో సిరీస్‌ని కైవసం చేసుకుంది. అయితే.. తొలిసారి వన్డే సిరీస్‌(Odi Series)లో కంగారూ జట్టును క్లీన్ స్వీప్ చేయాలనే టీమిండియా కల నెరవేరలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. బ‌దులుగా భారత జట్టు 49.4 ఓవర్లలో 286 పరుగులకే కుప్పకూలింది.

భారత్ తరఫున కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) అత్యధికంగా 81 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లి(Virat Kohli) 56 పరుగులతో, శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer) 48 పరుగులతో ఇన్నింగ్స్ ఆడినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. రవీంద్ర జడేజా(Ravindra Jadeja) 35 పరుగులు, కేఎల్ రాహుల్(KL Rahul) 26 పరుగులు చేశారు. ఓపెనర్‌గాకు వచ్చిన వాషింగ్టన్ సుందర్(Washington Sundar) 18 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆస్ట్రేలియా తరఫున గ్లెన్ మాక్స్‌వెల్(Glenn Maxwell) అత్యధికంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. జోష్ హేజిల్‌వుడ్ రెండు, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, కెమెరాన్ గ్రీన్, తన్వీర్ సంఘా తలా ఒక వికెట్ తీశారు.

మిచెల్ మార్ష్ 84 బంతుల్లో 13 ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 96 పరుగులు చేశాడు. డేవిడ్ వార్నర్ 56 పరుగులు, స్టీవ్ స్మిత్ 74 పరుగులు, మార్నస్ లాబుషాగ్నే 72 పరుగులు చేశారు. భారత్ తరఫున జస్ప్రీత్ బుమ్రా గరిష్టంగా మూడు వికెట్లు పడగొట్టాడు. అయితే 10 ఓవర్లలో 81 పరుగులు స‌మ‌ర్పించుకున్నాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్(Man of the Match) గ్లెన్ మాక్స్‌వెల్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్(man of the series) శుభ్‌మ‌న్ గిల్(Shubhman Gill) ఎంపిక‌య్యారు.

Updated On 27 Sep 2023 10:32 PM GMT
Yagnik

Yagnik

Next Story