Ajinkya Rahane : కొన్ని రోజులు క్రికెట్‌కు విరామం.. క్రేజీ ఆఫర్‌ను తిరస్కరించిన రహానే.!
టీమిండియా క్రికెటర్ అజింక్యా రహానే కొన్ని రోజులు క్రికెట్‌కు విరామం తీసుకునే అవకాశం ఉంది. వెస్టిండీస్ పర్యటన నుండి తిరిగి వచ్చిన తర్వాత.. రహానే కుటుంబంతో గడపాలని నిర్ణయించుకున్నాడు.
టీమిండియా క్రికెటర్ అజింక్యా రహానే(Ajinkya Rahane) కొన్ని రోజులు క్రికెట్‌కు విరామం తీసుకునే అవకాశం ఉంది. వెస్టిండీస్(Westindies) పర్యటన నుండి తిరిగి వచ్చిన తర్వాత.. రహానే కుటుంబంతో గడపాలని నిర్ణయించుకున్నాడు. ఏడాది చివర్లో జరిగే దక్షిణాఫ్రికా సిరీస్(South Africa)కు సన్నద్ధం కావాలని భావిస్తున్న రహానే.. ఈ కారణంగా ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్(England County Cricket) ఆఫర్‌ను తిరస్కరించాడు.
బిజీ షెడ్యూల్ నేపథ్యంలో ఆట నుండి కొన్ని రోజులు సెలవు తీసుకోవాలనుకుంటున్నందున రహానే లీసెస్టర్(Leicestershire) తరుపున కౌంటీ క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా లేనని తిరస్కరించాడు. 35 ఏళ్ల రహానే జూన్‌లో కౌంటీ క్లబ్ లీసెస్టర్‌లో చేరాల్సి ఉంది. అయితే అంతర్జాతీయ క్రికెట్(International Cricket) కట్టుబాట్ల కారణంగా రహానే క్లబ్‌లో చేరలేకపోయాడు.
ఐపీఎల్ తర్వాత రహానే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్(World Test Championship)లో ఆడటానికి ఇంగ్లాండ్(England)కు వెళ్ళాడు. ఈ నెల ప్రారంభంలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన భారత జట్టులోనూ తను సభ్యుడుగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే రహానే ఆగస్టు(August), సెప్టెంబర్(September)లలో క్రికెట్ నుండి విరామం తీసుకోవాలనుకుంటున్నారని.. దీంతో మునుపటి షెడ్యూల్ ప్రకారం లీసెస్టర్‌కు ఆడలేడని క్లబ్ తెలిపింది.
"మేము అజింక్యా పరిస్థితిని బాగా అర్థం చేసుకున్నాము. అతడు ఇటీవల బిజీ షెడ్యూల్‌తో ఉన్నాడు. విరామ సమయంలో కుటుంబంతో గడపాలనే అతని కోరికను మేము అంగీకరిస్తున్నాము" అని క్లబ్ క్రికెట్ డైరెక్టర్ క్లాడ్ హెండర్సన్(Claude Henderson) ఒక ప్రకటనలో తెలిపారు. మేము రహానేతో నిరంతరం టచ్‌లో ఉన్నాము. క్రికెట్‌లో పరిస్థితులు ఎంత త్వరగా మారుతాయో గుర్తించాం. ఏదో ఒక రోజు అతను లీసెస్టర్‌షైర్‌కు ఆడతాడని మేము ఆశిస్తున్నామని పేర్కొన్నారు.