Narendra Modi Stadium : భారత్-పాక్ మ్యాచ్ జరిగే స్టేడియంను పేల్చివేస్తానని బెదిరించిన నిందితుడి నేర చరిత్ర తెలుసా..?
నరేంద్ర మోదీ స్టేడియంను పేల్చివేస్తామని బెదిరించిన నిందితుడిని అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ అరెస్ట్ చేసింది. ఈమెయిల్ ద్వారా నిందితుడు బెదిరింపులకు పాల్పడ్డ విషయం తెలిసిందే.

Ahemdabad Crime Branch Arrested Karan Mavi from Rajkot who threaten to destroy Narendra Modi Stadium During Ind vs Pak Clash in World Cup
నరేంద్ర మోదీ స్టేడియం(Narendra Modi Stadium)ను పేల్చివేస్తామని బెదిరించిన నిందితుడిని అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్(Ahmadabad Cime Branch) అరెస్ట్(Arrest) చేసింది. ఈమెయిల్(Email) ద్వారా నిందితుడు బెదిరింపులకు పాల్పడ్డ విషయం తెలిసిందే. నిందితుడిని కరణ్ మావి(Karan Mavi)గా గుర్తించారు. అతడిని రాజ్‌కోట్(Rajkot)లో అరెస్టు చేశారు.
బీసీసీఐ(BCCI)కి బెదిరింపు మెయిల్ వచ్చింది. అక్టోబరు 14, 2023న మోటేరా ప్రాంతంలోని నరేంద్ర మోదీ స్టేడియంలో పేలుడు జరుగుతుందని.. దాని వల్ల ప్రతి ఒక్కరూ వణికిపోతారని నిందితుడు మొయిల్‌లో రాశాడు. క్రైమ్ బ్రాంచ్(Crime Branch) ప్రకారం.. నిందితుడు మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని ధార్(Thar) జిల్లాకు చెందినవాడు.
కరణ్ మావి గతంలో అత్యాచారం, మానవ అక్రమ రవాణా, నేరపూరిత బెదిరింపు ఆరోపణలపై 2018లో అరెస్టయ్యాడని పోలీసులు తెలిపారు. ధార్‌లోని ధామ్‌నోడ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని వివరించారు. అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్(India), పాకిస్థాన్(Pakistan) మధ్య మ్యాచ్ జరగనుంది.
