పాకిస్థాన్ క్రికెట్‌లో రచ్చ కొనసాగుతోంది. బాబర్ అజామ్ మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. ఈ నేప‌థ్యంలో షహీన్ షా ఆఫ్రిదికి T20 కెప్టెన్సీ, షాన్ మసూద్ కు టెస్ట్ కెప్టెన్సీని అప్పగించింది టీమ్ మేనేజ్‌మెంట్‌.

పాకిస్థాన్ క్రికెట్‌(Pakistan Cricket)లో రచ్చ కొనసాగుతోంది. బాబర్ అజామ్(Babar Azam) మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ(Captaincy)కి రాజీనామా చేశాడు. ఈ నేప‌థ్యంలో షహీన్ షా ఆఫ్రిది(Shaheen Afridi)కి T20 కెప్టెన్సీ, షాన్ మసూద్(Shan Masood) కు టెస్ట్ కెప్టెన్సీ(Test Captain)ని అప్పగించింది టీమ్ మేనేజ్‌మెంట్‌. అయితే వన్డే జట్టు కెప్టెన్(One Day Captain) గురించి మాత్రం ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.

వ‌న్డే ప్రపంచ కప్-2023లో పాకిస్తాన్ పేలవమైన ప్రదర్శన తర్వాత బాబర్ ఆజం కెప్టెన్సీని వదిలేస్తాడ‌ని టాక్ న‌డుస్తుంది. అప్పటి నుంచి కెప్టెన్ రేసులో షాహీన్ అఫ్రిది పేరు వినిపిస్తోంది. ఈ ప్రపంచకప్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన ఏకైక పాక్‌ ప్లేయర్ షాహీన్ కావ‌డం విశేషం.

షాహీన్ PSLలో లాహోర్ ఖలాండర్స్(Lahore Qalandars) జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. షాహీన్ ఆ జట్టును ఛాంపియన్‌(Champion)గా కూడా నిలిపాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతడిని టీ20 జ‌ట్టుకి కెప్టెన్‌గా చేయడం సరైన నిర్ణయమని భావిస్తున్నారు. మహ్మద్ రిజ్వాన్(Mohammad Rizwan) కూడా కెప్టెన్సీ రేసులో ఉన్నాడు.. కానీ అతనికి ఆ బాధ్యత ఇవ్వలేదు.

పాకిస్తాన్ కొత్త టెస్టు కెప్టెన్ షాన్ మసూద్ పేరు చర్చలో లేదు.. కానీ అతడికి అనూహ్య‌గా కెప్టెన్సీ అప్పగించారు. 34 ఏళ్ల మసూద్ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్.. పాకిస్థాన్ తరపున 30 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 28 సగటుతో 1,597 పరుగులు చేశాడు. ఇప్పటి వరకూ టెస్టు జట్టులో అతని స్థానం సుస్థిరం కాలేదు.. కానీ అతడికి అకస్మాత్తుగా జట్టు కెప్టెన్సీ ఇచ్చారు. దీంతో త‌దుప‌రి ఆస్ట్రేలియా పర్యటనలో మసూద్ నాయకత్వంలో పాకిస్థాన్ జట్టు ఎలా రాణిస్తుందోన‌న్న ఆందోళ‌న అభిమానుల్లో మొద‌లైంది.

పాకిస్థాన్ క్రికెట్‌లో రాజకీయాలు ఎప్పుడూ ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో షాహీన్ ఆఫ్రిది కెప్టెన్ అయిన తర్వాత జట్టులో అనేక ఇతర మార్పులు కూడా జరిగే అవ‌కాశం ఉంది. పాక్ కోచింగ్ స్టాఫ్, సెలక్షన్ కమిటీలో ఖచ్చితంగా మార్పు ఉంటుంది. కోచింగ్ సిబ్బందిని NCAకి పంపారు. కొత్త కోచ్‌ను త్వరలో ప్రకటించ‌నున్నారు. అదే సమయంలో కొత్త సెలక్షన్ కమిటీని కూడా త్వరలో ప్రకటించనున్నారు.

Updated On 15 Nov 2023 10:15 PM GMT
Yagnik

Yagnik

Next Story