☰
✕
న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ పురుషుల T20 క్రికెట్ చరిత్రలో అద్భుతమైన స్పెల్ తో చరిత్ర సృష్టించాడు. నాలుగు ఓవర్ల స్పెల్ బౌలింగ్ చేసి ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా రెండు వికెట్లకు మించి తీసిన మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. T20 వరల్డ్ కప్ 2024లో తమ గ్రూప్ C మ్యాచ్‌లో పాపువా న్యూ గినియాపై ఫెర్గూసన్ నాలుగు మెయిడిన్ ఓవర్లు వేశాడు. పురుషుల T20 ప్రపంచ కప్ చరిత్రలో లాకీ ఫెర్గూసన్ అత్యంత పొదుపుగా బౌలింగ్ వేసిన గణాంకాలను నమోదు చేశారు. నవంబర్ 2021లో కూలిడ్జ్‌లో పనామాతో జరిగిన T20Iలో నాలుగు మెయిడిన్లు వేసిన కెనడాకు చెందిన సాద్ బిన్ జాఫర్ తర్వాత లాకీ ఫెర్గూసన్ రెండవ బౌలర్. ఈ మ్యాచ్ లో ఫెర్గూసన్ మూడు వికెట్లను తీసి పాపువా న్యూ గినియాను ఊహించని దెబ్బ తీశాడు.
T20I క్రికెట్‌లో అత్యంత తక్కువ పరుగులు ఇచ్చిన స్పెల్‌లు
లాకీ ఫెర్గూసన్ - 4 ఓవర్లు, 0 పరుగులు, 3 వికెట్లు - 2024లో న్యూజిలాండ్ vs ఉగాండా
సాద్ బిన్ జాఫర్ - 4 ఓవర్లు, 0 పరుగులు, 2 వికెట్లు - కెనడా vs పనామా 2021లో
నువాన్ కులశేఖర - 2 ఓవర్లు, 0 పరుగులు, 1 వికెట్ - శ్రీలంక vs నెదర్లాండ్స్ 2014లో
Eha Tv
Next Story