1983 Players Remuneration : 1983లో క్రికెటర్ల ఫీజు చూస్తే ఆశ్చర్యపోకమానరు
1983లో కపిల్ దేవ్(Kapil dev) నేతృత్వంలో భారతదేశానికి తొలి వరల్డ్ కప్(First World Cup) వచ్చింది.

1983లో కపిల్ దేవ్(Kapil dev) నేతృత్వంలో భారతదేశానికి తొలి వరల్డ్ కప్(First World Cup) వచ్చింది. అప్పటి నుంచి భారత క్రికెట్ ముఖచిత్రమే మారిపోయింది. భారత్‌లో క్రికెట్(Cricket) స్థాయిని ఈ ప్రపంచకప్ పెంచింది. ఆ తర్వాత భారతదేశానికి 2011లో మరోసారి వరల్డ్ కప్ వచ్చింది. కానీ అప్పటి టోర్నమెంట్‌లో పాల్గొన్న క్రీడాకారులకు బీసీసీఐ(BCCI) చెల్లించిన ఫీజు(Fee) చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అప్పటితో పోల్చితే ఇప్పుడు ఒక్కో ఆటగాడికి దాదాపు వెయ్యిరెట్లు ఎక్కువే కాదు ఇంకా అంతకన్న ఎక్కువే చెల్లిస్తారు. అయితే 1983లో క్రికెట్ మ్యాచ్‌లో పాల్గొన్న క్రీడాకారులకు మ్యాచ్ ఫీజు ఎంతో తెలిస్తే ఇంత చీపా అనుకుంటారు.
1983 తర్వాత క్రికెట్ జట్టు సభ్యులకు కేవలం ఫీజు రూ.1500 (అక్షరాల పదిహేను వందలు మాత్రమే). దీంతో పాటు రూ.200 అలవెన్స్(Allowed) ఉంది. దీనికి సంబంధించిన ఫొటో ఒకటి వైరల్‌గా మారింది. ప్రముఖ జర్నలిస్ట్ రజత్ శర్మ(rajath sharma) సభ్యుల ఫీజు వివరాల ఫొటోను ఒకటి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. జట్టు కెప్టెన్ కపిల్ దేవ్ సహా ఇతర సభ్యులకు రూ.1500 ఫీజు మాత్రమే ఉంది. మూడు రోజుల అలవెన్స్ అంటే రోజుకు రూ.200 కలుపుకొని మొత్తం 2,100 రూపాయలు చెల్లించనట్లుగా ఉంది. దీనిపై నెటిజన్లు చాలా పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. ఇప్పటి క్రికెటర్లకు కోట్లలో చెల్లింపులు ఉంటే అప్పుడు వందల్లో ఉండేదని వ్యాఖ్యానిస్తున్నారు.
అయితే వరల్డ్ కప్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన కపిల్ ఆస్తులు ప్రస్తుతం దాదాపు రూ.252 కోట్లు ఉందని సమాచారం. ఆయన రిటైర్ అయిన తర్వాత కూడా కపిల్ దేవ్ పలు వాణిజ్య ప్రకటనలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. పలు వాణిజ్య సంస్థల వ్యాపారాల ప్రమోషన్ చేస్తారు. వాటి ద్వారా రూ.20-30 లక్షలు సంపాదిస్తారు. టీవీల్లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారు. దాదాపు ఏడాదికి రూ.12 కోట్ల వరకు కపిల్ సంపాదిస్తున్నారు.
