మంచినీళ్ల బాటిల్‌(Water Bottle) ఎంత ఉంటుంది? మనం తాగేది అయితే ఓ 20 రూపాయలుంటుంది. అదే హోటల్స్‌లోనో, మల్టీప్లెక్స్‌లోనో వంద రూపాయలుంటుందేమో! ఒక విరాట్‌ కోహ్లీ వంటి వాళ్లు తాగే నీళ్ల బాటిల్‌ రేటు 600 రూపాయలు ఉంటుంది. వాటర్‌ బాటిల్‌ రేటు ఆరువందలా అంటూ గుండెలు బాదుకున్నాం.

మంచినీళ్ల బాటిల్‌(Water Bottle) ఎంత ఉంటుంది? మనం తాగేది అయితే ఓ 20 రూపాయలుంటుంది. అదే హోటల్స్‌లోనో, మల్టీప్లెక్స్‌లోనో వంద రూపాయలుంటుందేమో! ఒక విరాట్‌ కోహ్లీ వంటి వాళ్లు తాగే నీళ్ల బాటిల్‌ రేటు 600 రూపాయలు ఉంటుంది. వాటర్‌ బాటిల్‌ రేటు ఆరువందలా అంటూ గుండెలు బాదుకున్నాం. మరిప్పుడు ఈ వాటర్‌ బాటిల్‌ రేటు చెబితే గుండెలే ఆగేట్టు ఉన్నాయి. ఎందుకంటే దాని రేటు అక్షరాల 45 లక్షల రూపాయలు! వీరు విన్నది నిజమే..! 45 లక్షల రూపాయలే! ఆ వాటర్‌ బాటిల్‌ మాత్రమే కాదు, అందులోని నీళ్లు కూడా చాలా చాలా ప్రత్యేకమైనవి.

ప్రపంచంలో అత్యంత ఖరీదైన మంచి నీళ్లు ఇవేనట! ఈ వాటర్‌ బాటిల్‌ పేరు అక్వా డి క్రిస్టలో ట్రిబ్యుటో ఎ మోడిగ్లియాని(Tributo Modigliani, Acqua di Cristallo)..పేరు కూడా రేటంత గొప్పగా ఉంది కదూ! అన్నట్టు ఆ బాటిల్‌లో ఎన్ని నీళ్లు ఉంటాయనుకుంటున్నారు? జస్ట్‌ 750 మిల్లీ లీటర్లే! అంత చిన్న వాటర్‌ బాటిల్‌కు 45 లక్షల రూపాయలెందుకన్న డౌట్‌ వచ్చే ఉంటుంది. ఈ నీళ్లను ఫ్రాన్స్, ఫిజీలలోని సహజ నీటిబుగ్గల నుంచి సేకరిస్తారట! భూగర్భ జలాలు ఉబికి భూమిపైన ప్రవహించే సహజ నీటి బుగ్గల నుంచి ఈ నీటిని సేకరిస్తారు. ఈ రోజుకు కూడా మార్కెట్‌లో అనేక మినరల్‌ వాటర్‌ బాటిల్లు ఈ విధంగా సహజ నీటి బుగ్గల నుంచి సేకరించినవే! మన దేశంలో కూడా ఈ విధమైన నీళ్ల బాటిల్లను 50 రూపాయల నుంచి 150 రూపాయల వరకు అమ్ముతున్నారు.

మళ్లీ అక్వా డి క్రిస్టలో ట్రిబ్యుటో ఎ మోడిగ్లియాని దగ్గరకు వద్దాం. ఈ బాటిల్‌ లోపలి భాగాన్ని 24 క్యారెట్ల బంగారంతో తయారు చేస్తారు. ఈ బాటిల్‌ ఆకారాన్ని ప్రపంచంలోనే ప్రసిద్ధ బాటిల్‌ డిజైనర్‌ అయిన ఫెర్నాండో అల్టామిరానో డిజైన్‌ చేశాడు. ప్రపంచంలోనే అతి ఖరీదైన హెన్రీ 4 హెరిటేజ్‌ డ్యుడోగ్నన్‌ కోగ్‌న్యాక్‌ అనే వైన్‌ బాటిల్‌ను డిజైన్‌ చేసింది కూడా ఫెర్నాండో అల్టామిరానోనే! ఈ బాటిల్‌లోని నీళ్లు కూడా ప్రత్యేక రుచి కలిగి ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్లో లభించే సగటు తాగునీటి కంటే ఎక్కువ శక్తిని అందిస్తుందట. అంత ఖరీదు పెట్టి ఎవరు తాగుతారనుకోవద్దు. మంచినీళ్లను డబ్బులా ఖర్చు పెట్టేవాళ్లు కూడా ఉంటారుగా! ఇలాంటి వారైన కొందరు సెలెబ్రిటీలు, ప్రముఖులు ఈ నీళ్లనే తాగుతారట!

Updated On 10 Oct 2023 5:08 AM GMT
Ehatv

Ehatv

Next Story