గత వారం భారీగా పెరిగిన ధరలు ఈ వారం ప్రారంభంలో కాస్త తగ్గినా.. ఈరోజు మళ్లీ బంగారం ధరలు(Gold Price) పెరిగాయి. సోమవారం బాగానే తగ్గినా.. మంగళవారం స్థిరంగా ఉంది. అయితే ఈరోజు మాత్రం బంగారం ధరలు పెరిగాయి.

Today Gold Price
గత వారం భారీగా పెరిగిన ధరలు ఈ వారం ప్రారంభంలో కాస్త తగ్గినా.. ఈరోజు మళ్లీ బంగారం ధరలు(Gold Price) పెరిగాయి. సోమవారం బాగానే తగ్గినా.. మంగళవారం స్థిరంగా ఉంది. అయితే ఈరోజు మాత్రం బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో(Silver Price) కూడా ఈరోజు పెరుగుదల కనిపించింది. ఈ మధ్య కాలంలో బంగారం ధరలు స్థిరంగా ఉండడం లేదనే చెప్పాలి. ఓ రోజు పెరగడం, వెంటనే తగ్గడం, మరుసటి రోజు పెరగడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ దశలో బంగారం ఎప్పుడు కొనాలన్న సందిగ్ధత వినియోగదారుడికి ఏర్పడింది.
ఇక ఈరోజు ధరలు చూస్తే.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 100 రూపాయలు పెరిగి రూ.57,400ల దగ్గర చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 110 రూపాయల పెరి రూ.62,620కు చేరింది . వెండి కూడా ఈరోజు పెరిగింది. హైదరాబాద్‌లో కిలో వెండి 300 రూపాయలు పెరిగి మట్టంగా 80 వేలకు చేరింది.
