అతి త్వరలోనే మారుతి సుజుకి డిజైర్‌(Maruti Suzuki Desire) వాహనం మార్కెట్‌లోకి రానుంది.

అతి త్వరలోనే మారుతి సుజుకి డిజైర్‌(Maruti Suzuki Desire) వాహనం మార్కెట్‌లోకి రానుంది. దీనికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఇప్పటికే కంపెనీ విడుదల చేస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. నవంబర్‌ 11న ఈ కారు(Car) మార్కెట్‌లోకి రానుంది. ఈ కాంపాక్ట్ సెడాన్‌కి సంబంధించిన బుకింగ్స్‌ కూడా ప్రారంభమయ్యాయి. ఇప్పటికే మార్కెట్‌లో అందుబాటులో ఉన్న డిజైర్‌కి భారీగా డిమాండ్‌ ఉంది. ప్రస్తుతం ఉన్న సెడాన్లతో పోల్చితే మారుతి డిజైర్ ఫ్యామిలీకారుగా ఉండనుంది. ఈకారు LXi, VXi, ZXi, ZXi+ అనే నాలుగు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. మంచి డిజైన్‌తో అద్భుతమైన లుక్‌తో రానుంది. అధునాతనమైన ఫీచర్లతో(advanced features) పాటు ఇంటీరియర్‌లో మంచి స్పేస్‌తో న్యూలుక్ అదిరిపోనుంది. 3,995 mm పొడవు, 1,735 mm వెడల్పు, 1,525 mm ఎత్తు, 2,450 mm వీల్‌బేస్‌తో వస్తుంది. ఇక దీని మొత్తం బరువు 1,375 కిలోలుగా ఉంది. ఇందులోని అన్ని వేరియంట్లలో ఐడల్ స్టార్ట్-స్టాప్ సిస్టమ్‌ని కలిగి ఉంటుంది. దీని మైలేజ్‌ గరిష్టంగా 33 కి.మీ.వరకు వస్తుందని కంపెనీ ప్రకటించింది. లగ్జరీ కార్లలో ఉండే ఫీచర్లతో సరికొత్తగా రానుంది. కొత్త LED హెడ్‌ల్యాంప్స్, హారిజాంటల్ స్లాట్స్‌తో కూడిన పాలిష్డ్ గ్రిల్, అలాయ్‌ వీల్స్, సరికొత్త LED టెయిల్‌లైట్స్‌, ఆటోమేటిక్ క్రూయిజ్ కంట్రోల్, క్లైమేట్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ మానిటర్, 360 డిగ్రీ కెమెరా వంటివి ఉన్నాయి.

ఈ డిజైర్‌ మారుతి డిజైర్ 1.2-లీటర్, 3 సిలిండర్స్‌ Z 12E పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 80 bhp పవర్, 112nm టార్క్‌ని విడుదల చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, AMT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్స్‌తో వస్తుంది. ఫ్యామిలీతో పాటు ట్యాక్సీ ఆపరేటర్లను కూడా దృష్టిలో ఉంచుకుని కాంపాక్ట్ సెడాన్‌ని సీఎన్‌జీ వేరియంట్‌ లోనూ తీసుకురానున్నారు. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్‌, వైడ్ యాంగిల్ రేయర్ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్లు ఇందులో చేర్చారు. డిక్కీ స్పేస్‌ కూడా ఎక్కువగా ఉండనుంది.. మైలేజీ అధికంగా కావాలనుకునేవారిని ఇది ఇంప్రెస్‌ చేయగలదు. ధర కూడ 7-8 లక్షల మధ్యలో ఉండనుంది. బుకింగ్స్‌ కూడా ప్రారంభం కావడంతో భారీగా డిమాండ్‌ ఏర్పడిందని సమాచారం

Eha Tv

Eha Tv

Next Story