ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న ఐఫోన్‌ 16 సిరీస్‌(iphone series 16) ఫోన్‌లు వచ్చేశాయి.

ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న ఐఫోన్‌ 16 సిరీస్‌(iphone series 16) ఫోన్‌లు వచ్చేశాయి. దాంతో పాటు యాపిప్‌(Apple) వాచ్‌ సిరీస్‌ 10, ఎయిర్‌పాడ్స్‌ 4 కూడా మార్కెట్లోకి వచ్చాయి. శాన్‌ఫ్రాన్సిస్కో వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో యాపిల్‌ పలు కొత్త ఉత్పత్తులను విడుదల చేసింది. కాలిఫోర్నియాలోని యాపిల్‌ పార్క్‌లో గ్రాండ్‌గా జరిగిన ఈ ఈవెంట్‌ను ఐఫోన్‌ అభిమానులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశారు. . ఐఫోన్‌ 16 సిరీస్‌ ఫోన్లలో బోల్డన్ని కొత్త ఫీచర్లు ఉన్నాయి. ఈ సరికొత్త మోడళ్లలో యాపిల్‌ ఇంటెలిజెన్స్‌ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. కొత్తగా టచ్‌ సెన్సిటివ్‌ కెమెరాతో పాటు, యాక్షన్‌ బటన్‌ ఇచ్చారు. కొత్త సిరీస్‌ ఫోన్లలో ఏ18 చిప్‌ అమర్చారు. న్యూరల్‌ ఇంజిన్‌తో కూడిన ఈ చిప్‌ రెండు రెట్లు స్పీడ్‌గా పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. 17 శాతం ఎక్కువ బ్యాండ్‌ విడ్త్‌తో కూడిన అప్‌గ్రేడెడ్‌ మెమోరీ సబ్‌సిస్టమ్‌ను కలిగి ఉన్నదని తెలిపింది. యాపిల్‌ ఇంటెలిజెన్స్‌ సహాయంతో ఫోన్‌లోని యాప్‌లను చాలా సులువుగా ఉపయోగించుకోవచ్చని, వందలకొద్ది కొత్త యాక్షన్స్‌ చేపట్టవచ్చని చెప్పింది. ఇదిలా ఉంటే వచ్చే నెలలో బీటా వెర్షన్‌లో ఇంగ్లీష్‌లో యాపిల్‌ ఇంటెలిజెన్స్‌ను(Apple intelegence,) విడుదల చేయనున్నారు. అనంతరం చైనీస్‌, ఫ్రెంచ్‌, జపనీస్‌, స్పానిష్‌ భాషల్లో ఇది విడుదల కానుంది. అయితే భారతీయ భాషలకు(Indian Language) సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. కొత్త సిరీస్‌ ఫోన్లలో బ్యాటరీ సామర్థ్యం ఎక్కువగా ఉంటుందని చెప్పిందే తప్ప పూర్తి వివరాలు యాపిల్‌ చెప్పలేదు. సెప్టెంబర్‌ 13 నుంచి అడ్వాన్స్‌ బుకింగ్‌లు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్‌ 20 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ కొత్త మోడళ్లలో యాపిల్‌ మ్యాగ్‌సేఫ్‌ ఛార్జింగ్‌ స్పీడ్‌ను 15 వాట్స్‌ నుంచి 25 వాట్స్‌కు పెంచింది. ఇక భారత్‌లో ధరల విషయానికి వస్తే ఐఫోన్‌ 15 మోడళ్లతో పోలిస్తే 16 మోడళ్లు తక్కువ ధరలకే అందుబాటులోకి రానున్నాయి. ఐఫోన్‌ 16 సిరీస్‌లో పలు కొత్త ఫీచర్‌లను యాపిల్‌ పరిచయం చేసింది. కొత్త సిరీస్‌ ఫోన్లను ఎయిరోస్పేస్‌ గ్రేడ్‌ అల్యూమినియంతో రూపొందించారు. గ్లాస్‌ బ్యాక్‌ ఫోన్లతో పోలిస్తే ఇది రెండు రెట్లు అధికంగా మన్నిక అని యాపిల్‌ ప్రకటించింది. ఐఫోన్‌ 16 డిస్‌ప్లే 6.1 అంగుళాల పొడవు ఉంటుంది. వెనిలా వేరియంట్‌తో దీన్ని రూపొందించారు. ఐఓఎస్‌ 18తో ఇది పనిచేస్తుంది. 2000 నిట్స్‌ వరకు బ్రైట్‌నెస్‌ను పెంచుకోవచ్చు. ఐఫోన్‌ 16 ప్లస్‌ డిస్‌ప్లే 6.7 అంగుళాల పొడవుతో ఇచ్చారు. దీంట్లో సూపర్‌ రెటినా ఎక్స్‌డీఆర్‌ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఉంది. ఇక కెమెరాల విషయానికి వస్తే వెనక వైపు 48 ఎంపీ వైడ్‌ యాంగిల్‌ కెమెరా ఇచ్చారు. 12 మెగాపిక్సెల్‌ అల్ట్రావైడ్‌ కెమెరా అమర్చారు. ముందువైపు సెల్ఫీల కోసం 12 ఎంపీ కెమెరా అమర్చారు. ఇక కెమెరా కంట్రోల్‌ బటన్‌తో చాలా సులభంగా ఫొటోలు, వీడియోలు తీసే అధునాతన ఫీచర్‌ ఉంది. ఇక ధరల విషయానికి వస్తే 128 స్టోరేజీతో కూడిన ఐఫోన్‌ 16 బేస్‌ మోడల్‌ ధర రూ.79,900 ఉండగా, ఐఫోన్‌ 16 ప్లస్‌ రూ.89,900 ఉంది. ప్రారంభం కానున్నాయి. ఐఫోన్‌ 16లో ‘ఏఏఏ గేమ్స్‌’ ఆడుకోవడానికి అవకాశం కల్పించారు. అంతకుముందు ప్రో మోడల్స్‌లో మాత్రమే ఈ ఫీచర్‌ ఉండేది. ఐఫోన్‌ 16 ప్రో డిస్‌ప్లే 6.3 అంగుళాలు, 16 ప్రో మాక్స్‌ డిస్‌ప్లే 6.9 అంగుళాలతో ఇచ్చారు. ఈ రెండు మోడళ్లలో అడ్వాన్స్‌డ్‌ కూలింగ్‌ ఛాంబర్‌ ఫీచర్‌ ఉంది. యాపిల్‌ ఇంటెలిజెన్స్‌ ఉపయోగించే క్రమంలో డివైజ్‌లు హీట్‌ కాకుండా ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుందని కంపెనీ ప్రకటించింది. ప్రో, ప్రో మాక్స్‌ మోడళ్లలో ఏ18 ప్రో చిప్‌ వాడినట్లు యాపిల్‌ తెలిపింది. ప్రో రెస్‌ వీడియో రికార్డింగ్‌, ఫాస్టర్‌ యూఎస్‌బీ 3 ట్రాన్సఫర్‌ స్పీడ్‌లో ఈ చిప్‌ అడ్వాన్స్‌డ్‌ మీడియా సామర్థ్యాలను కలిగిఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఇక కెమెరా విషయానికి వస్తే వెనక వైపు రెండు 48 మెగాపిక్సెల్‌ కెమెరాలను వాడారు. ఒకటి 48 ఎంపీ ఫ్యూజన్‌ కెమెరా కాగా, మరొకటి అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా. 12 ఎంపీ 5X టెలిఫొటోతో ఫొటోలు తీయవచ్చు. ప్రో మోడళ్లలో 4k120 క్వాలిటీతో వీడియోలు రికార్డు చేయవచ్చు. ఇక కెమెరా కంట్రోల్‌ ఫీచర్‌తో హెడీఆర్‌ రికార్డింగ్‌కు అవకాశం కల్పించారు. ఇక ధరల విషయానికి వస్తే 128 జీబీ స్టోరేజీ గల బేస్‌ మోడల్‌ 16 ప్రో ధర రూ. 1,19,900 (999 డాలర్లు), 256 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీతో వచ్చే ప్రో 16 మాక్స్‌ రూ. 1,44,900 (1199 డాలర్లు)తో ఈ మోడళ్లు ప్రారంభమవుతాయి. యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 10లో కూడా పలు అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు ఉన్నాయి. గత వాచ్‌లతో పోలిస్తే ఈ వాచ్‌ల డిస్‌ప్లేలు చాలా పెద్దవని యాపిల్‌ ప్రకటించింది. ధరల విషయానికి వస్తే జీపీఎస్‌ ధర 399 డాలర్లు, జీపీఎస్‌+ సెల్యూలార్‌ 499, అల్ట్రా 2 ధరను 799 డాలర్లుగా నిర్ణయించారు. ఇక ఎయిర్‌పాడ్స్‌ 4ను 129 డాలర్లుగా, యాక్టివ్‌ నాయిస్‌ క్యానిసిలేషన్‌ మోడల్‌ ధరను 179 డాలర్లుగా నిర్ణయించారు.

Eha Tv

Eha Tv

Next Story