ఈ రోజు నుంచి నుమాయిష్(Exhibition) మొదలవుతున్నది. ఫిబ్రవరి 15వ తేదీ వరకు 46 రోజులపాటు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతోంది. ప్రతి ఏడాది నాంపల్లి(Nampally) ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించే ఈ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth), సొసైటీ అధ్యక్షుడు, మంత్రి శ్రీధర్‌బాబుతో(Sridhar Babu) కలిసి ప్రారంభిస్తారు. నిజాం(Nizam) కాలం నుంచి కొనసాగుతూ వస్తున్న ఈ ఎగ్జిబిషన్‌కు అప్పట్లో బ్రహ్మండమైన క్రేజ్ ఉండేది.
ఈ రోజు నుంచి నుమాయిష్(Exhibition) మొదలవుతున్నది. ఫిబ్రవరి 15వ తేదీ వరకు 46 రోజులపాటు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతోంది. ప్రతి ఏడాది నాంపల్లి(Nampally) ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించే ఈ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth), సొసైటీ అధ్యక్షుడు, మంత్రి శ్రీధర్‌బాబుతో(Sridhar Babu) కలిసి ప్రారంభిస్తారు. నిజాం(Nizam) కాలం నుంచి కొనసాగుతూ వస్తున్న ఈ ఎగ్జిబిషన్‌కు అప్పట్లో బ్రహ్మండమైన క్రేజ్ ఉండేది. సోమవారం నుంచి మొదలు కానున్న నుమాయష్‌కు అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు 2400 స్టాళ్లను ఏర్పాటు చేయ నుండగా అమ్యూజ్‌మెంట్ పార్క్, ఫుడ్ కోర్టులు(Food courts), వివిధ పారిశ్రామికవేత్తల ఉత్పత్తి అమ్మకాలు చేపట్టేందుకు స్టాళ్లను ఏర్పాటు చేస్తారు. సందర్శ కులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లను చేపడుతున్నారు. పోలీస్(Police), అగ్ని మాపక శాఖ అప్రమత్తంగా ఉండి నుమాయిష్ విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ(RTC) ప్రత్యేక బస్సులను నడపడంతో పాటు మెట్రో రైలు(Metro Train) వేళలను పొడిగించనున్నారు. ఇదిలాఉంటే ఇవాళ్టి నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి అర్ధరాత్రి వరకు పరిసరాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సిద్దంబర్‌బజార్(Siddiambar bazar) వైపు నుంచి నాంపల్లి వైపునకు వెళ్లే ఆర్టీసీ జిల్లా బస్సులు, ప్రైవేట్ బస్సులు, ఇతర భారీ వాహనాలను మొహింజామార్కెట్(MJ Market) వద్ద అబిడ్స్ వైపు మళ్లిస్తారు. బషీర్‌బాగ్, కంట్రోల్ రూం వైపు నుంచి నాంపల్లికి వచ్చే వాహనాలను ఏఆర్ పెట్రోల్ బంక్ వద్ద బీజేఆర్ విగ్రహం, అబిడ్స్ వైపు మళ్లిస్తారు. బేగంబజార్, ఛత్రి నుంచి మలాకుంట వైపు వెళ్లే వాహనాలను అలస్క జంక్షన్ వద్ద దారుసలాం, ఏక్‌మినార్ వైపు మళ్లిస్తారు. దారుసలాం నుంచి అఫ్జల్‌గంజ్ వైపు వెళ్లే వాహనాలను అలస్క జంక్షన్ నుంచి బేగంబజార్, సిటీ కాలేజ్ వైపు మళ్లిస్తారు.మూసాబౌలి, బహుదూర్‌పురా వైపు నుంచి నాంపల్లికి వెళ్లే వాహనాలను సిటీ కాలేజీ వద్ద నయాపూల్, ఎంజేమార్కెట్ రూట్‌లో మళ్లిస్తారు.