సంక్రాంతికి ఎలక్ట్రిక్ స్కూటర్ (Electric Scooter) కొనాలనుకుంటున్నారా.. అయితే భారీగా డిస్కౌంట్ ప్రకటించింది ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల కంపెనీ ఏథర్ (Ather). కొత్త కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొత్త ప్లాన్ వేసింది. బెంగళూరు (Bangaluru) కేంద్రంగా ఉన్న ఈ కంపెనీ దాదాపు ఒక్కో స్కూటర్‌పై రూ.20 వేల వరకు డిస్కౌంట్ (Discount) ఇస్తున్నట్లు ప్రకటించింది

ather scooter-compressed
సంక్రాంతికి ఎలక్ట్రిక్ స్కూటర్ (Electric Scooter) కొనాలనుకుంటున్నారా.. అయితే భారీగా డిస్కౌంట్ ప్రకటించింది ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల కంపెనీ ఏథర్ (Ather). కొత్త కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొత్త ప్లాన్ వేసింది. బెంగళూరు (Bangalore) కేంద్రంగా ఉన్న ఈ కంపెనీ దాదాపు ఒక్కో స్కూటర్‌పై రూ.20 వేల వరకు డిస్కౌంట్ (Discount) ఇస్తున్నట్లు ప్రకటించింది. బేసిక్ మోడల్ ఏథర్ 450S మోడల్‌పై రూ.20 వేల డిస్కౌంట్‌ను ఈ కంపెనీ ప్రకటించింది. ఏథర్ 450S ధర రూ.1.09 లక్షల నుంచి ప్రారంభ ధర ఉంది. బెంగళూరులో కొనేవారికి ఈ ధర వర్తిస్తుంది. ఢిల్లీలో (Delhi) దీని ధర రూ.97,500 నుంచి ఉంది.
అంతే కాకుండా ఏథర్ 450 S ప్రో ప్యాక్ (ProPack) ధర కూడా రూ.25 వేల వరకు తగ్గింది. ప్రో ప్యాక్ ఫీచర్ కలిగిన ఈ స్కూటర్‌ను కొంటే కొనుగోలుదారులకు రైడ్ అసిస్ట్, ఏథర్ బ్యాటరీ ప్రొటెక్ట్, ఏథర్ స్టాక్ అప్‌డేట్స్‌తో పాటు ఏథర్ కనెక్ట్ అనే ఫీచర్లు లభిస్తాయి. దీని బ్యాటరీ చార్జింగ్‌కు 6 గంటల 36 నిమిషాలపాటు చార్జింగ్ పెడితే 80 శాతం వరకు చార్జింగ్ అవుతుంది. కాగా బజాజ్ చేతక్ (Bajaj Chethak) అర్బన్ ధర రూ. 1.15 లక్షల నుంచి ఉంటే.. టీవీఎస్ (TVS) ఐక్యూబ్ ధర రూ. 1.23 లక్షలు ఉంది. అలాగే ఓలా (Ola) ఎస్1 ఎయిర్ ధర కూడా రూ. 1.2 లక్షల నుంచి . ఈ మోడళ్ల ధరలతో పోలిస్తే ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర తక్కువ ఉందనే అనుకోవాలి. అయితే మార్కెట్‌లో ఉన్న పోటీ కారణంగానే ఈ డిస్కౌంట్‌నుప్రకటించినట్లు సమాచారం.
