ఎంతైనా ఐ-ఫోన్(Iphone) ఐ-ఫోనే! మొబైల్ లవర్స్ అందరూ ఇష్టపడే ఫోన్ ఇది! అందుకే ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ ఐ ఫోన్‌కు పిచ్చ క్రేజ్ ఉంటుంది. కొన్నాళ్లుగా ఎంతో ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఆపిల్ ఐ-ఫోన్ 15 సిరీస్ ఫోన్లు(Iphone 15) మార్కెట్‌లోకి వచ్చేశాయి. ఆపిల్ సీఈవో టిమ్‌కుక్ ఈ ఫోన్లను లాంఛనంగా రిలీజ్ చేశారు. అమెరికా కాలమానం ప్రకారం సెప్టెంబర్ 12 రాత్రి 10.30 గంటలకు కాలిఫోర్నియాలోని ఆపిల్ పార్క్‌లో స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో వండర్ లస్ట్ పేరుతో నిర్వహించిన ఈవెంట్‌లో ఆపిల్ ఐ ఫోన్ 15 సిరీస్‌ను మార్కెట్‌లోకి విడుదల చేశారు.
ఎంతైనా ఐ-ఫోన్(Iphone) ఐ-ఫోనే! మొబైల్ లవర్స్ అందరూ ఇష్టపడే ఫోన్ ఇది! అందుకే ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ ఐ ఫోన్‌కు పిచ్చ క్రేజ్ ఉంటుంది. కొన్నాళ్లుగా ఎంతో ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఆపిల్ ఐ-ఫోన్ 15 సిరీస్ ఫోన్లు(Iphone 15) మార్కెట్‌లోకి వచ్చేశాయి. ఆపిల్ సీఈవో టిమ్‌కుక్ ఈ ఫోన్లను లాంఛనంగా రిలీజ్ చేశారు. అమెరికా కాలమానం ప్రకారం సెప్టెంబర్ 12 రాత్రి 10.30 గంటలకు కాలిఫోర్నియాలోని ఆపిల్ పార్క్‌లో స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో వండర్ లస్ట్ పేరుతో నిర్వహించిన ఈవెంట్‌లో ఆపిల్ ఐ ఫోన్ 15 సిరీస్‌ను మార్కెట్‌లోకి విడుదల చేశారు. ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు డైనమిక్ ఐలాడ్ టెక్నాలజీతో ఆవిష్కరించారు. 2000 పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగిన ఈ ఐ-ఫోన్ 15 డిస్‌ప్లే 6.1 అంగుళాలుగా ఉంది. ఇక ఐ-ఫోన్ 15 ప్లస్ 6.7 అంగుళాల డిస్ ప్లే ఫ్యానల్‌తో వచ్చింది. ఐ-ఫోన్ 15 కెమెరా 48-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్, న్యూ 2x టెలిఫోటో జూమ్ కలిగి ఉంటుంది. ఏ16 బయోనిక్ చిప్ కలిగి ఉంది. సెకండ్ జనరేషన్ ఆల్ట్రా వైడ్ బాండ్ చిప్ ఫీచర్ కూడా జత చేశారు. ఇందులో శాటిలైట్ కనెక్టివిటీ సర్వీస్ అందుబాటులోకి తెచ్చారు. తొలిసారి యూఎస్బీ టైప్-సీ పోర్ట్ చార్జర్ తో ఐ-ఫోన్ 15 ఆవిష్కరించారు. మొదట ఆపిల్ వాచ్ సిరీస్ 9 స్మార్ట్ వాచ్ విత్ న్యూ ఎస్ 9 చిప్ ఆవిష్కరించారు. ఆల్ డే 18 గంటల బ్యాటరీ లైఫ్ దీని సొంతం. ఇంగ్లీష్, మండారిన్ భాషల్లో మీ వాయిస్ వినిపిస్తే చాలు వెంటనే మీ హెల్త్ డేటా చెక్ చేస్తుంది. ఇందులో యాక్సిలో మీటర్, గైరో స్కోప్ ఫీచర్లతోపాటు 2000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ఉంటుందని ఆపిల్ ప్రకటించింది. కస్టమ్ ఎస్9 చిప్ గల ఈ వాచ్.. వాచ్ఓఎస్10 వర్షన్ పై పని చేస్తుంది. ఫాస్ట్ చార్జింగ్ ఫెసిలిటీ ఉంటుంది. ఆ తర్వాత వాచ్ ఆల్ట్రా 2 ఆవిష్కరించారు. ఇది సెప్టెంబర్ 22 నుంచి మార్కెట్లో అందుబాటులోకి వస్తుంది. ఎస్9 చిప్, డబుల్ టాప్ గెశ్చర్, 3000 నిట్స్ డిస్‌ప్లే బ్రైట్‌నెస్, మాడ్యులర్ ఆల్ట్రా వాచ్ ఫేస్, కస్టమిసబుల్ యాక్షన్ బటన్, సపోర్ట్ ఫర్ బ్లూ టూత వంటి ఫీచర్లు ఉన్నాయి. రెగ్యులర్ వాడకంలో 36 గంటలు పవర్ సేవింగ్ మోడ్ లో 72 గంటల బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. ఆపిల్ వాచ్ ఆల్ట్రా ఖరీదు 799 డాలర్లు, వాచ్ సిరీస్ 9 ఖరీదు 399 డాలర్లు. ఐ-ఫోన్ 15 మూడు వేరియేషన్లలో లభిస్తున్నది. 128 జీబీ ఫోన్ ధర 79 వేల 900 రూపాయలుగా ఉంటే 256 జీబీ ధర 89 వేల 900 రూపాయలుగా ఉంది. 512 జీబీ ఫోన్ ధర 1,09,900 రూపాయలు. ఇక ఐఫోన్ 15 ప్లస్ ఫోన్ కూడా మూడు రకాల్లో దొరుకుతున్నాయి. 128 జీబీ రేటు 89 వేల 900 రూపాయలుగా ఉంది. 256 జీబీ రేటు 99 వేల 900 రూపాయలుగా ఉంది. 512 జీబీ ఫోన్ రేటు 1,19,900 రూపాయలు ఉంది. ఇక ఆపిల్ ఐ ఫోన్ 15 ప్రో ధరలు కాసింత ఎక్కువగానే ఉన్నాయి. 128 జీబీ ఫోన్ రేటు 1,34,900 రూపాయలుగా ఉంది. 256 జీబీ ఫోన్ రేటు 1, 44, 900 రూపాయలు ఉంటే, 512 జీబీ ఫోన్ రేటు 1,64,900 రూపాయలు. ఇక 1 టీబీ ఫోన్‌ను 1,84,900 రూపాయలు పెట్టి కొనాల్సి ఉంటుంది. ఆపిల్ ఐ ఫోన్ 15 ప్రొ మాక్స్ ధరలు మరికాస్త ఎక్కువగా ఉన్నాయి. 256 జీబ ఫక్షన్ 1.59,900 రూపాయలుగా ఉంటే, 512 జీబీ రేటు 1,79,900 రూపాయలుగా ఉంది. వన్ టెర్రా బైట్ ఫోన్ రేటు 1,99,900 రూపాయలు ఉంది.
ఐఫోన్15.. ఐఫోన్ 15 ప్లస్ ఫీచర్లు
సూపర్ రెటీనా ఓఎల్డీ డిస్ ప్లే విత్ డైనమిక్ ఐలాండ్, 2000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, 6.1 అంగుళాల డిస్ ప్లే, సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్, ఎన్ క్లోజర్ మేడ్ ఆఫ్ 75 పర్సెంట్ అల్యూమినియం, 48 -మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా సెన్సఱ్ విత్ సెన్సర్ షిఫ్ట్ ఓఐఎస్, ఆల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, మెయిన్ కెమెరాలో 2x సెన్సర్ జూమ్, ఆటో పోర్ట్రైట్ ఇన్ ఫొటో మోడ్ విత్ ఆప్షన్ టూ అడ్జస్ట్ డెప్త్, క్యాట్స్ అండ్ డ్యాగ్స్ వంటి పెంపుడు జంతువుల కోసం పొర్ట్రైట్, ఏ16 బయోచిప్ కెపాసిటీ, యూ2 ఆల్ట్రా వైడ్ బాండ్ చిప్ ఫర్ ప్రిసిసన్ లొకేషన్ షేరింగ్ కేపబిలిటీస్, ఎమర్జెన్సీ ఎస్వోఎస్, శాటిలైట్ ద్వారా రోడ్ సైడ్ అసిస్టెన్స్.. ప్రస్తుతానికి అమెరికాకు మాత్రమే ఈ సేవలు పరిమితం, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ విత్ సపోర్ట్ ఫర్ చార్జింగ్, డేటా ట్రాన్స్ ఫర్, ఆడియో అండ్ వీడియో, రివర్స్ వైర్డ్ చార్జింగ్ విత్ యూఎస్బీ -సీ, మాగ్ సేఫ్ వైర్ లెస్ చార్జర్.