టాలీవుడ్ హీరోయిన్ సంయుక్త మీనన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు..

ఈమె చేసింది కొన్ని సినిమాలే నా అన్ని మంచి హిట్ టాక్ ని అందుకున్నాయి. దాంతో అమ్మడుకు వరుస అవకాశాలు వస్తున్నాయి. బాలీవుడ్ నుంచి వచ్చిన ఈ భామకు టాలీవుడ్ లో క్రేజీ అవకాశాలు వస్తున్నాయి.
ఒకవైపు సినిమాలు సెట్ మీద ఉండగానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది సంయుక్త. దాంతో బిజీగా మారింది.. అయితే ఇప్పటివరకు ఆమె సైన్ చేసిన సినిమాలు గురించి పెద్దగా అనౌన్స్ చేసినట్టు కనిపించలేదు. కానీ వరుస సినిమాలను మాత్రం లైనప్ లో పెట్టుకుంటుందని ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది.. సంయుక్త మీనన్ సినిమాల గురించి ఒకసారి తెలుసుకుందాం..
ఈ అమ్మడు మొదటి సినిమానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా లో ఈమె రానా సరసన జోడిగా నటించింది.. ఆ మూవీ ఎంతగా హిట్ అయిందో అందరికీ తెలుసు.
మొదటి సినిమాలోని తన నటనకు అందానికి మార్కులు పడ్డాయి ఆ తర్వాత వరుస అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అది కూడా స్టార్ హీరోలు సినిమాల్లో ఛాన్స్ రావడం మామూలు విషయం కాదు..
ప్లాపుల్లో ఉన్న హీరోలకు హిట్స్ ఇచ్చి గోల్డెన్ లెగ్ అయ్యింది. పనిలో పనిగా రెమ్యునరేషన్ పెంచేసింది. మరీ ఆ భామకు ఉన్న డిమాండ్ అట్లాంటిది.
విరూపాక్షతో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకున్న ఈ కుర్ర హీరోయిన్.. టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్ లో కూడా స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని అందుకుంది..