శ్రియా శరణ్ తెలుగు, తమిళం, హిందీ చిత్రసీమలో అందంతో పాటు అభినయంతోను ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి.

శ్రియా శరణ్ తెలుగు, తమిళం, హిందీ చిత్రసీమలో అందంతో పాటు అభినయంతోను ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి. 1982 సెప్టెంబర్ 11న ఉత్తరాఖండ్‌లో జన్మించిన శ్రియా, బాలీవుడ్‌లో కాకుండా దక్షిణ భారత సినీ పరిశ్రమలో ఎక్కువగా పేరు తెచ్చుకుంది.




శ్రియా శరణ్ తన సినీ కెరీర్‌ను 2001లో తెలుగు చిత్రసీమలో "ఇష్టం" సినిమా ద్వారా ప్రారంభించింది. మొదటి సినిమానే మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. అయితే, "సంతోషం" (2002) చిత్రం ఆమె కెరీర్‌కు మంచి టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమె టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా మారింది.




2000ల కాలంలో టాప్ హీరోలందరి సరసన నటించి, భారీ విజయాలను అందుకుంది. మహేష్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, ప్రభాస్, ఎన్టీఆర్, అజిత్, రజినీకాంత్ వంటి లెజెండరీ హీరోలతో కలిసి సినిమాలు చేసింది.










ehatv

ehatv

Next Story