✕
Kushi 2023 Release Date : రౌడీ బాయ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘ఖుషి’ రిలీజ్ అప్పుడేనట.. !
By EhatvPublished on 23 March 2023 5:45 AM GMT
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (vijay devarakonda) ‘లైగర్’ చిత్రం తర్వాత వస్తున్న సినిమా ‘ఖుషీ’. ఈ చిత్రానికి శివ నిర్వణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. సమంత హెల్త్ ప్రాబ్లమ్స్ కారణంగా ఈ చిత్రం షూటింగ్ కు కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చారు. అదలా ఉంటే ఈ మూవీ టీమ్ ఆడియన్స్ ఓ గుడ్ న్యూస్ అనౌన్స్ చేశారు.

x
Kushi
-
- రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (vijay devarakonda) ‘లైగర్’ చిత్రం తర్వాత వస్తున్న సినిమా ‘ఖుషీ’. ఈ చిత్రానికి శివ నిర్వణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. సమంత హెల్త్ ప్రాబ్లమ్స్ కారణంగా ఈ చిత్రం షూటింగ్ కు కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చారు. అదలా ఉంటే ఈ మూవీ టీమ్ ఆడియన్స్ ఓ గుడ్ న్యూస్ అనౌన్స్ చేశారు.
-
- ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు చిత్ర యూనిట్. ఎట్టకేలకు ఒక అందమైన కొత్త పోస్టర్‌తో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు. సెప్టెంబర్ 1న ‘ఖుషి’ థియేటర్లలో విడుదల కానుంది. ఈ కొత్త పోస్టర్లో సమంత (Samantha Ruth Prabhu), విజయ్ వేర్వేరు నేపథ్యాల నుంచి చేతులు పట్టుకుని కనిపిస్తున్నారు.
-
- ఫస్ట్ ఈ చిత్రాన్ని డిసెంబర్ 23న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే సమంత హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల మూవీ రిలీజ్ వాయిదా వేశారు. ఇప్పుడు తాజాగా కొత్త డేట్ ను ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తోంది.
-
- విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), సమంత (Samantha) జంటగా నటించిన ‘ఖుషి’ చిత్రం మంచి ఫీల్ గుడ్ లవ్ డ్రామాగా తెరకెక్కింది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా ఇటు తెలుగుతోపాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదకానుంది.
-
- మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తోన్న ఈ చిత్రంలో సచిన్ ఖేడేకర్, జయరామ్, అలీ, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ నటిస్తున్నారు. ఇక ఈ మూవీకి మలయాళీ మూవీ హృదయం ఫేమ్ హిషామ్ అబ్దుల్ వాహబ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Ehatv
Next Story