✕
Rock Fort Temple : వినాయకుడి నుదిట మీద విభీషణుడి దెబ్బ!
By EhatvPublished on 16 Sep 2023 6:01 AM GMT
విఘ్నేశ్వరుడి ఆలయాలు ప్రపంచమంతటా ఉన్నాయి. అయితే అత్యంతపురాతన ఆలయం మాత్రం తమిళనాడులోని(Tamilnadu) తిరుచ్చిలో(Tiruchi) ఉంది. ఇదే రాక్‌ఫోర్ట్ టెంపుల్‌గా(Rock Fort Temple) ప్రసిద్ధి చెందింది. పల్లవరాజుల శిల్పకళానైపుణ్యానికి మహాబలిపురమే కాదు.ఈ ఆలయం కూడా మచ్చుతునకే! ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకున్న ఈ అరుదైన ఆలయాన్ని ఎందరో రాజులు అభివృద్ధి చేశారు. ఒకే శిలపై మూడు దేవాలయాలను ఇక్కడే చూడగలం. పర్వతంపై 83 మీటర్ల ఎత్తునున్న శిలపై ఆలయాన్ని నిర్మించారు.

x
Rock Fort Temple
-
- విఘ్నేశ్వరుడి ఆలయాలు ప్రపంచమంతటా ఉన్నాయి. అయితే అత్యంతపురాతన ఆలయం మాత్రం తమిళనాడులోని(Tamilnadu) తిరుచ్చిలో(Tiruchi) ఉంది. ఇదే రాక్‌ఫోర్ట్ టెంపుల్‌గా(Rock Fort Temple) ప్రసిద్ధి చెందింది. పల్లవరాజుల శిల్పకళానైపుణ్యానికి మహాబలిపురమే కాదు.ఈ ఆలయం కూడా మచ్చుతునకే! ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకున్న ఈ అరుదైన ఆలయాన్ని ఎందరో రాజులు అభివృద్ధి చేశారు. ఒకే శిలపై మూడు దేవాలయాలను ఇక్కడే చూడగలం. పర్వతంపై 83 మీటర్ల ఎత్తునున్న శిలపై ఆలయాన్ని నిర్మించారు.
-
- ఈ ఆలయ సముదాయాల నిర్మాణాన్ని పల్లవ రాజులు తమ భుజస్కంధాల మీద వేసుకుంటే, ఆ తర్వాత విజయనగర రాజులు. మధురై నాయకులు మిగతా భారాన్ని మోసి ఆలయాన్ని పూర్తి చేశారు. ఎంతో కష్టపడి 437 మెట్లు ఎక్కితే కాని శిఖరాన్ని చేరుకోలేం. పర్వత పాదాల దగ్గర మనిక వినాయకర్ ఆలయం ఉంది. శిఖరం దగ్గర ఉచ్చి పిల్లయార్ ఆలయం ఉంది. సుప్రసిద్ధ తాయుమనస్వామి శివాలయం ఉన్నది కూడా ఇక్కడే! ఈ ఆలయానికి ఓ స్థలపురాణం ఉంది.
-
- రావణ(Ravana) సంహారం తర్వాత యుద్ధంలో తనకు ఎంతగానో సహకరించిన విభీషణుడికి(Vibhishana) ఏదైనా కానుక ఇవ్వాలనుకుంటాడు శ్రీరాముడు(Sri Ram). విష్ణుమూర్తి అవతారమైన రంగనాథస్వామి(Ranganathaswamy) విగ్రహాన్ని విభీషణుడికి బహుమతిగా ఇస్తాడు. రంగనాథస్వామి విగ్రహాన్ని విభీషణుడు లంకకు తీసుకెళ్లడాన్ని దేవతలు భరించలేకపోతారు. విభీషణుడు ఆ విగ్రహాన్ని తీసుకెళ్లకుండా ఆపడం కోసం వినాయకుడి సాయం కోరతారు. సరేనంటాడు విఘ్నేశ్వరుడు(Ganesh). రాముడు ఇచ్చిన విగ్రహాన్ని తీసుకుని లంకకు బయలుదేరిన విభీషణుడు కావేరి నది(Kaveri River) చెంతకు చేరతాడు.
-
- నదిలో స్నానమాచరించాలంటే విగ్రహాన్ని ఎవరికైనా ఇవ్వాలి. ఎందుకంటే ఒక్కసారి ఆ విగ్రహాన్ని నేలపైన పెడితే మళ్లీ తీయడం సాధ్యం కాదు. అప్పుడే అక్కడ పశువుల కాపరి వేషంలో వినాయకుడు వస్తాడు. మారువేషంలో ఉన్న ఆ గణపతి చేతికి విగ్రహాన్ని అందించి విభీషణుడు స్నానానికి వెళతాడు. పాపం ఆయన వెళ్లగానే పైన పెడతాడు వినాయకుడు. ఆ విగ్రహం పెట్టిన చోటు రంగనాథస్వామి ఆలయంగా రూపుదిద్దుకుంది.
-
- వినాయకుడు చేసిన పనికి విభీషణుడికి విపరీతమైన కోపం వచ్చేస్తుంది. పశువులకాపరిని పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. అతడేమో పక్కనే ఉన్న కొండపైకి ఎక్కేస్తాడు. బాలుడిని వెంబడిస్తూ విభీషణుడు కూడా కొండెక్కేస్తాడు. బాలుడిని పట్టుకుని నుదిటిపై ఓ దెబ్బ వేస్తాడు. మారువేషంలో ఉన్న బాలుడు కాస్తా వినాయకుడిగా మారిపోతాడు. అప్పుడు తన తప్పును తెలుసుకుంటాడు విభీషణుడు.
-
- విఘ్నేశ్వరుడిని క్షమాపణ వేడుకుంటాడు. వినాయకుడు ప్రసన్నుడవుతాడు. మన ఇద్దరి కలయికకు గుర్తుగా నేను ఈ కొండమీద ఉంటానని వరమిస్తాడు వినాయకుడు. సూక్ష్మ గణపతిగా కొండమీద వెలుస్తాడు. అప్పుడే అక్కడో ఆలయాన్ని నిర్మించాడు విభీషణుడు. ఆ మందిరాన్నే పల్లవులు అభివృద్ధి చేశారు. అందుకే ఇది ప్రపంచంలోనే అతి ప్రాచీన వినాయక ఆలయమయ్యింది.
-
- విభీషణుడి దెబ్బ తాలూకు మచ్చ ఇప్పటికీ ఉచ్చ పిళ్ళైయార్ విగ్రహానికి ఉండటాన్ని గమనించవచ్చు. పర్వత శిఖరం నుంచి చూస్తే తిరుచ్చి నగరం, కావేరీ నది, శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామి ఆలయం స్పష్టంగా కనిపిస్తాయి. అన్నట్టు ఈ ఆలయం ఉన్న పర్వతం సుమారు 3800 మిలియన్ల సంవత్సరాల కిందట ఏర్పడినదట! ప్రతి రోజు ఇక్కడ ఆరు రకాల పూజలు చేస్తారు. చైత్రమాసంలో బ్రహ్మోత్సవం కూడా నిర్వహిస్తారు.

Ehatv
Next Story