✕
NTR30 Pooja Ceremony : హైదరాబాద్‌లో ఘనంగా ఎన్టీఆర్30 సినిమా ప్రారంభోత్సవం
By EhatvPublished on 23 March 2023 1:36 AM GMT
ఎన్టీఆర్-కొరటాల శివ ( NTR-Koratala Siva) కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ఎట్టకేలకు ప్రారంభమైంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా ప్రారంభోత్సవం ఈ రోజు హైదరాబాద్‌లో చిత్ర బృందం సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది.

x
NTR30
-
- ఎన్టీఆర్-కొరటాల శివ ( NTR-Koratala Siva) కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ఎట్టకేలకు ప్రారంభమైంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా ప్రారంభోత్సవం ఈ రోజు హైదరాబాద్‌లో చిత్ర బృందం సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది.
-
- ఈ కార్యక్రమానికి ఎస్ఎస్ రాజమౌళి, ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్, హీరోయిన్ జాన్వీ కపూర్, కొరటాల శివ, జాన్వీకపూర్, ప్రకాశ్‌రాజ్ శ్రీకాంత్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్, ప్రొడ్యూసర్ కల్యాణ్ రామ్‌తోపాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. సినీ పరిశ్రమ వాళ్లంతా హాజరై సినిమాపై మరింత అంచనాలు పెంచారు.
-
- ఎస్ఎస్ రాజమౌళి ( SS Rajamouli) NTR30 చిత్రానికి ఫస్ట్ క్లాప్ కొట్టారు. కొరటాల శివ (Koratala Siva)కెమెరా స్విచ్ ఆన్ చేయగా, ప్రశాంత్ నీల్ (prashanth neel) దర్శకత్వం వహించారు. వైట్ కలర్ డ్రెస్సులో ఎన్టీఆర్ సింపుల్‌గా క్యాజువల్‌గా ఉండగా, గ్రీన్ కలర్ కాంచీవరం చీరలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) సౌత్ స్టైల్లో కనిపించింది.
-
- NTR30 చిత్రం ఫిబ్రవరిలోనే రిలీజ్ అవ్వాల్సి ఉండగా తారకరత్న మృతితో వాయిదా పడింది. ఈ రోజు అఫిషియల్‌గా ఎన్టీఆర్ అండ్ టీం NTR30 సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభంకానుంది. దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలి సినిమా ఇది.
-
- ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధా ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ కె, సుధాకర్ మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విలన్‌గా సైఫ్ అలీ ఖాన్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. NTR30 పూర్తిగా యాక్షన్ ఓరియెంటెడ్‌గా సాగుతుంది. గతేడాది మేలో ఈ సినిమా మోషన్ పోస్టర్ విడుదల చేశారు.
-
- ఇటీల తాను సినిమాల నుంచి తప్పుకుంటున్నట్టు ఎన్టీఆర్ ( NTR) చెప్పారు. అయితే అభిమానులు, మీడియా నుంచి తన తదుపరి సినిమాల గురించి నిరంతరం ప్రశ్నలు ఎదురవుతుండడంతో విశ్వక్ సేన్ (vishwak sen) ‘ దాస్ కా ధమ్కి’ చిత్ర కార్యక్రమానికి హాజరైనప్పుడు తాను సినిమాల నుంచి తప్పుకుంటానని సరదాగా చెప్పినట్టు ఆయన అన్నారు.
-
- ఈ సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) ఈ ప్రాజెక్ట్ కోసం ట్యూన్స్ రెడీ చేస్తున్నాడు. ఇక చిత్రం ఏప్రిల్ 5, 2024 నుంచి థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించనుంది.
-
- ఎస్ఎస్. రాజమౌళి, ప్రశాంత్ నీల్ కలిసి దిగిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఎన్టీఆర్ 30 సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Ehatv
Next Story