AP elections 2024 : జగన్‌కు బోధపడిన తత్వం..అందుకే మార్పులు-చేర్పులు
దాదాపుగా సిట్టింగులందరికీ టికెట్లు ఇచ్చి చేజేతులా ఓటమి కొని తెచ్చుకున్నారు కేసీఆర్(KCR). ఇదే మాటను చాలా మంది అంటూ ఉన్నారు. ఒకవేళ తీవ్ర వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి, ఆ స్థానాలలో కొత్తవారికి అవకాశం ఇచ్చి ఉంటే ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడే మెజారిటీ వచ్చి ఉండేదని విశ్లేషకులు చెబుతున్నారు. నిజానికి 2018లోనే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో పీకలదాక కోపం ఉంది. కాకపోతే కేసీఆర్ మొహం చూసి ఓటేశారు. పైపెచ్చు చంద్రబాబుతో(Chandrababu) కాంగ్రెస్(Congress) చేతులు కలపడం టీఆర్ఎస్కు(TRS) అడ్వాంటేజ్ అయ్యింది. అంతటి వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను మార్చకుండా కేసీఆర్ విఫల ప్రయోగం చేశారు. దెబ్బతిన్నారు. ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను మార్చకపోతే ఏం జరుగుతుందో పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి(Jagan Mohan Reddy) తెలిసివచ్చింది.

AP elections 2024
-
- దాదాపుగా సిట్టింగులందరికీ టికెట్లు ఇచ్చి చేజేతులా ఓటమి కొని తెచ్చుకున్నారు కేసీఆర్(KCR). ఇదే మాటను చాలా మంది అంటూ ఉన్నారు. ఒకవేళ తీవ్ర వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి, ఆ స్థానాలలో కొత్తవారికి అవకాశం ఇచ్చి ఉంటే ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడే మెజారిటీ వచ్చి ఉండేదని విశ్లేషకులు చెబుతున్నారు. నిజానికి 2018లోనే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో పీకలదాక కోపం ఉంది. కాకపోతే కేసీఆర్ మొహం చూసి ఓటేశారు. పైపెచ్చు చంద్రబాబుతో(Chandrababu) కాంగ్రెస్(Congress) చేతులు కలపడం టీఆర్ఎస్కు(TRS) అడ్వాంటేజ్ అయ్యింది. అంతటి వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను మార్చకుండా కేసీఆర్ విఫల ప్రయోగం చేశారు. దెబ్బతిన్నారు. ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను మార్చకపోతే ఏం జరుగుతుందో పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి(Jagan Mohan Reddy) తెలిసివచ్చింది.
-
- తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల(TS Assembly Elections) ఫలితాలు ఓ రకంగా జగన్‌కు జాగ్రత్తపడమని సూచించాయి. వైనాట్ 175 అంటూ(Why Not 175) వస్తున్న జగన్‌కు తత్వం బోధపడింది. ఇప్పుడాయనకు జ్ఞానోదయం అయ్యింది. ఇలా అయితే కుదరదని డిసైడయ్యారు. ప్రజలలో వ్యతిరేకత పెంచుకున్న నాయకులకు మళ్లీ టికెట్ల ఇస్తే పరిస్థితులు ఎదురుతిరుగుతాయన్న సత్యాన్ని తెలుసుకున్నారు. సర్వేలు చేయించారు. సర్వేలలో బలహీనంగా ఉన్న ఎమ్మెల్యేలను(MLA) మార్చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఇందులో బంధుమిత్రులన్న తేడా కూడా చూడటం లేదు. తనను నమ్ముకుని తన వెంట వచ్చినవారికి కూడా ఈసారి టికెట్లు కష్టమే. అలాగని వారిని పూర్తిగా వదిలేసుకోవడం లేదు.
-
- వారికి కూడా మంచి పదవులు ఇవ్వాలనే జగన్ అనుకుంటున్నారు. ఎన్నికలకు ఎంతో సమయం లేదు. ఇప్పుడు ఏ చిన్న పొరపాటు చేసినా చంద్రబాబు(Chandrababu) లబ్ధి పొందుతారు. అందుకే జగన్ చాలా జాగ్రత్తపడుతున్నారు. సర్వేలలో(Survey) ఓడిపోయే నియోజకవర్గాలేమిటో తెలుసుకున్న జగన్ అక్కడ నాయకులను మార్చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే కొందరికి సమాచారం అందించారు. తనకు టికెట్ రాదని గ్రహించిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(Alla Rama Krishna Reddy) పార్టీని, పదవిని వదిలేశారు. వెంటనే అక్కడ ఓ బీసీ సామాజికవర్గ నాయకుడిని ఇన్‌ఛార్జ్‌గా ప్రకటించారు. దీంతో పాటు పలు నియోజకవర్గ ఇన్ఛార్జులను కూడా మార్చేశారు. గెలుపు మీద కొండంత ధీమాగా ఉన్న కేసీఆర్ ఎన్నికల్లో ఎలా బోల్తా కొట్టారో చూసిన జగన్ అతి విశ్వాసం పనికిరాదనే నిర్ణయానికి వచ్చారు.
-
- మొన్న జరిపిన సర్వేలో జగన్ ప్రభుత్వంపై ప్రజలలో పెద్దగా వ్యతిరేకత లేదనే వచ్చింది. 2.57 లక్షల శాంపిళ్లతో చేసిన ఆ సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party) 50.10 శాతం ఓట్లను సంపాదించుకుంటుందని తేలింది. తెలుగుదేశంపార్టీ(TDP)- జనసేన(Janasena) కలిసి పోటీ చేసినా ఆ కూటమికి వచ్చేది 43.12 శాతం ఓట్లే! ఇక బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు కలిసి 2.08 శాతం ఓట్లు వస్తాయట! ఇంకా అటూ ఇటూ తేలనివి 4.70 శాతం ఓట్లు ఉన్నాయట! అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నందన్న మాట! ఎంత కాదనుకున్నా ఆ పార్టీకి 113 సీట్లు వస్తున్నాయి.
-
- 16 స్థానాలలో గట్టి పోటీ ఉంది. 46 స్థానాలలో కచ్చితంగా ఓడిపోబోతున్నది. ఇంకా ఎన్నికల షెడ్యూల్ రాలేదు, నోటిఫికేషన్ జారీ కాలేదు. అప్పుడు పరిస్థితి కొద్దిగా మారవచ్చు. ఓట్ల శాతాలలో తేడా రావచ్చు. జగన్ దిగిపోవాలన్నంత వ్యతిరేకత అయితే లేదు కానీ ప్రభుత్వ వ్యతిరేకత అయితే కొంచెం ఉంది. అంటే 2019లో గెలిచినట్టుగా ఈసారి 151 స్థానాలు దక్కవనిపిస్తోంది. జగన్ ఇప్పట్నుంచి జాగ్రత్త పడితే మార్పులు చేస్తే కిందటిసారి అన్ని స్థానాలు రావొచ్చేమో! తనకు దగ్గరి బంధువులకైనా నో చెప్పే అవకాశం ఉంది. టీడీపీ-జనసేనలను జగన్ అంత తేలికగా తీసుకోవడం లేదు.గ్రామ సచివాలయాలు, రూపం మార్చుకున్న స్కూళ్లు, ఇంగ్లీష్ మీడియం, సంక్షేమ పథకాల కింద వివిధ వర్గాలకు అందుతున్న నగదు, ప్రజలకు అందుబాటులో వైద్యం... ఇవన్నీ జగన్‌కు కలిసి వచ్చే అంశాలు. దాంతో పాటు రాజధాని, పోలవరం వంటివి ప్రతికూలంగా మారవచ్చు. ఇవాళ్టికి ఎవరు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని అడిగితే 58 శాతం మంది జగన్మోహన్ రెడ్డి అని జవాబిచ్చారు. చంద్రబాబును కోరుకుంటున్నది కేవలం 29 శాతం మంది మాత్రమే! ఇక జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు(Pawan kalyan) జై కొట్టింది కేవలం ఏడు శాతం మందే! ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం,మహిళలలో ఎక్కువ శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు ఉన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల్లో చాలా మంది టీడీపీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు.
