బిగ్‌బాస్‌(Bigg boss) రియాలిటీ షోకు ఎక్కడ్లేని క్రేజ్‌ ఉంది.

బిగ్‌బాస్‌(Bigg boss) రియాలిటీ షోకు ఎక్కడ్లేని క్రేజ్‌ ఉంది. ఇప్పటి వరకు వచ్చిన ఏడు సీజన్‌లు హిట్టయ్యాయి. బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లాలని చాలా మంది ముచ్చటపడతారు.విష్ణుప్రియ భీమనేని(Vishnu priya) కూడా బిగ్‌బాస్‌లోకి వెళ్లింది. గెంతులెస్తోంది. గారాలు పోతున్నది. ఆమె తెలుగునాట పేరొందిన యాంకరే! షార్ట్‌ ఫిలింస్‌తో గ్లామర్‌ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టిన విష్ణుప్రియ తర్వాత యాంకర్‌ అయ్యారు.పోవే పోరా షోతో ఫేమస్‌ అయ్యారు. అటు పిమ్మట పలు టీవీ షోలు చేశారు. కొన్ని కామెడీ స్కిట్స్‌ కూడా చేశారు. జరీజరీ చీర కట్టి సాంగ్‌తో యూ ట్యూబ్‌ను అల్లాడించారు.ఇప్పుడు విష్ణుప్రియ బిగ్‌బాస్‌లోకి పార్టిసిపెంట్‌గా వెళ్లంతో ఆమె గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.అప్పుడెప్పుడు బిగ్‌బాస్‌ షోపై ఆమె కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తనకు కోట్లు ఇచ్చినా బిగ్‌బాస్‌ మొహం చూడనన్నాను. బయట ప్రపంచం చాలా అందంగా ఉందని, అలాంటప్పుడు బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లాల్సిన అవసరం ఏముందని అన్నారు.'మన ఇంట్లో వాళ్లుంటారు. వాళ్లను చూసుకోవాలి. నేను బిగ్ బాస్ పర్సన్ ను కాదు. నేను ఆ షోను ఎప్పుడు చూడలేదు. నేను ఆ షోను అస్సలు ఎంకరేజ్ చేయను. నేను ఎప్పుడూ ఆ షోలోకి వెళ్లను. కావాలంటే రాసిస్తా' అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చారు. అంతగా ప్రతిన బూనిన విష్ణుప్రియ మాట మీద ఉంటే బాగుండేది.మాట తప్పి బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టింది. హుషారెక్కించే స్టెప్పులతో హౌస్‌లోకి ఎంటరయ్యింది. నెటిజన్ల జ్ఞాపకశక్తిని పాపం విష్ణుప్రియ తక్కువ అంచనా వేసింది. వారు పాత వీడియోను తవ్వి తీశారు. బిగ్‌బాస్‌లోకి వెళ్లనని తెగేసి చెప్పిన ఆమె ఇప్పుడు ఎందుకు వెళ్లినట్టు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్లు ఇచ్చినా వెళ్లనన్న ఆమె ఇప్పుడు అదే డబ్బు కోసం వెళ్లిందంటూ ట్రోల్స్ చేస్తున్నారు



Updated On 4 Sep 2024 9:37 AM GMT
Eha Tv

Eha Tv

Next Story