✕
World Bicycle Day : ప్రపంచ సైకిల్ దినోత్సవం, పాత కాలంలో సైకిల్ ఎలా ఉండేదో తెలుసా?
By EhatvPublished on 3 Jun 2023 12:40 AM GMT
పాతకాలపు సైకిళ్లతో పాటు లేటెస్ట్గా తయారు చేసిన సైకిళ్లను కూడా మనం ఇక్కడ చూడవచ్చు.. పరిమాణంలో వచ్చిన వ్యత్యాసాలను కూడా గమనించవచ్చు.. చూడముచ్చటగొలిపే సైకిళ్లు ఓ పట్టాన మ్యూజియం నుంచి బయటకు రానివ్వవు.. రకరకాల రంగులలో దర్పంగా నిలుచుకున్న సైకిళ్లను చూసి మనసు పారేసుకోకుండా ఉండలేం.. క్రెయిగ్ మోరో అనే ఆయన కృషి ఫలితమే ఈ మ్యూజియం! మూడు దశాబ్దాలుగా సైకిళ్లను సేకరిస్తూ వస్తున్నారాయన! అలా సేకరించినవాటితోనే ఏడేళ్ల కిందట ఈ మ్యూజియంను ఏర్పాటు చేశారు.. దానికి చక్కగా సైకిల్ హెవెన్ అని పేరు పెట్టారు.. ఇప్పుడీ మ్యూజియంను చూసేందుకు పర్యాటకులు క్యూలు కడుతున్నారు

x
World Bicycle Day
-
- ఇవాళ ప్రపంచ సైకిల్ దినోత్సవం (World Bicycle Day) అట! సైకిల్‌కు కూడా ఓ రోజంటూ ఉంటుందా అని ఆశ్చర్యపోకండి. సైకిల్‌ను మరి తక్కువగా చూడాల్సిన అవసరం లేదు. అసలు సైకిల్ ప్రాముఖ్యతను గమనించే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ(United Nation Assembly) ప్రతీ ఏడాది జూన్ 3వ తేదీన ప్రపంచ సైకిల్ దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానించింది. ఈ తరానికి సైకిల్ గొప్పతనం గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ, ఓ మూడు నాలుగు దశాబ్దాల కిందట సైకిల్ అనేది ఓ స్టేటస్ సింబల్.
-
- ఇంట్లో సైకిల్ ఉందంటే వారు గొప్పవారి కిందే లెక్క. అప్పట్లో ఉద్యోగులు తమ కార్యాలయాలకు సైకిల్ మీదే వెళ్లేవారు. విద్యార్థులు కూడా అంతే! ఏడో దశకం ముందు పుట్టినవారికి సైకిల్ ఓ మధుర జ్ఞాపకం. సైకిల్‌ను ఎంతో మురిపెంగా చూసుకునేవారు. ఆ రోజులే వేరు! ఆ బంగారు రోజులు మళ్లీ రమ్మన్నా రావు. మనం సైకిల్ అని అంటున్నాం కానీ దాన్ని బైస్కిల్ అనే పిలవాలి. తొక్కడాన్ని సైకిల్, సైక్లింగ్ అని అంటాం. కాకపోతే సైకిల్ అన్న పదం మనకు బాగా అలవాటయ్యింది. మొదటిసారి బైస్కిళ్లను సృష్టించిన దేశం ఫ్రాన్స్. అయితే ఇప్పుడు మనం వాడుతున్న డిజైన్ సైకిళ్లను తయారుచేసింది మాత్రం ఇంగ్లాండ్.
-
- మనకు ఊహొచ్చాక ఎక్కి తిరిగే వాహనం సైకిలే! సైకిల్‌తో మనకున్న అనుబంధమే వేరు! ఓ తరం ముందువారికైతే సైకిలే సర్వస్వం. ఎంతదూరమైనా సైకిల్‌పై హాయిగా వెళ్లొచ్చేవారు! పాతతరం వారికి బీపీలు, షుగర్లు ఎక్కువగా అంటకపోవడానికి కారణమేమిటంటే సైకిలే! ఎడ్ల బళ్లను, గుర్రపు టాంగాలను వదిలేస్తే మొదటిసారిగా రోడ్డెక్కిన ద్విచక్రవాహనం సైకిలే! తాతల కాలం నుంచి ఇప్పటి వరకు సైకిల్‌కు అదే క్రేజు! దానిపై అదే మోజు! సైకిల్ దినోత్సవం రోజున సైకిల్ సంగతులు చెప్పుకుని తీరాలి. గత స్మృతులను కచ్చితంగా నెమరేసుకోవాలి. అప్పట్లో సైకిల్ ఎలా ఉండేదో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయాలి. అందుకోసం అమెరికాలో ఉన్న సైకిల్ మ్యూజియంను సందర్శించాలి.
-
- అంత దూరం వెళ్లడం కుదిరేపని కాదు కానీ వివరాలను తెలుసుకుందాం! మన పూర్వీకులు ఉపయోగించిన సైకిల్ దగ్గర నుంచి ఈ తరం వాడుతున్న సైకిల్ వరకు అన్నింటిని ఒక్క దగ్గర చూసే అవకాశం అక్కడ ఉంది. మొట్టమొదటగా సైకిల్ ఎలా ఉండేది..? సైకిళ్ల పరిణామక్రమంబెట్టిది..? రూపు రేఖలు ఏ విధంగా మారాయి..? ఇత్యాది విషయాలను తెలుసుకోడానికి సైకిల్ స్వర్గం చక్కగా ఉపయోగపడుతుంది.. సైకిల్ స్వర్గమంటే మరేం లేదు. సైకిల్ మ్యూజియమే! అమెరికా పెన్సిల్వేనియాలోని పిట్స్‌బర్గ్‌లో (bicycle museum pittsburgh) ఉందీ మ్యూజియం.
-
- ప్రపంచంలో ఉన్న అతి పెద్ద సైకిల్ ప్రదర్శనశాల ఇదే! పేరు సైకిల్ హెవెన్! అచ్చ తెలుగులో సైకిల్ స్వర్గం. పేరుకు తగ్గట్టుగానే అదో సైకిల్ స్వర్గం! మ్యూజియంలోపలికి వెళితే ఎక్కడ చూసినా సైకిళ్లే కనిపిస్తాయి.. గోడలు.. పైకప్పులు సమస్తం సైకిళ్లే దర్శనమిస్తాయి.. మూడు వేలకు పైగా సైకిళ్లను చాలా పొందికగా పెట్టారిక్కడ! మొదట మనమేదో సైకిల్ షాపుకు వచ్చామన్న ఫీలింగ్ కలుగుతుంది. ఆ తర్వాత సైకిళ్ల గొప్పతనమేమిటో అర్థమవుతుంది..? కాలానికి అనుగుణంగా మారిన సైకిళ్ల నిర్మాణంపై అవగాహన వస్తుంది..
-
- పాతకాలపు సైకిళ్లతో పాటు లేటెస్ట్గా తయారు చేసిన సైకిళ్లను కూడా మనం ఇక్కడ చూడవచ్చు.. పరిమాణంలో వచ్చిన వ్యత్యాసాలను కూడా గమనించవచ్చు.. చూడముచ్చటగొలిపే సైకిళ్లు ఓ పట్టాన మ్యూజియం నుంచి బయటకు రానివ్వవు.. రకరకాల రంగులలో దర్పంగా నిలుచుకున్న సైకిళ్లను చూసి మనసు పారేసుకోకుండా ఉండలేం.. క్రెయిగ్ మోరో అనే ఆయన కృషి ఫలితమే ఈ మ్యూజియం! మూడు దశాబ్దాలుగా సైకిళ్లను సేకరిస్తూ వస్తున్నారాయన! అలా సేకరించినవాటితోనే ఏడేళ్ల కిందట ఈ మ్యూజియంను ఏర్పాటు చేశారు.. దానికి చక్కగా సైకిల్ హెవెన్ అని పేరు పెట్టారు.. ఇప్పుడీ మ్యూజియంను చూసేందుకు పర్యాటకులు క్యూలు కడుతున్నారు

Ehatv
Next Story