✕
Balakrishna Vs Nurses : తీట బాలయ్య.. కాంట్రవర్సిలకు కేర్ ఆఫ్గా నటసింహం.!
By EhatvPublished on 8 Feb 2023 6:06 AM GMT

x
Balakrishna controversial comments on nurses in unstoppable show
-
- తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈవెంట్లు, రియార్టీషోలు కాంట్రవర్సీలకు దారి తీస్తున్నాయి. అందులోనూ మన బాలయ్య బాబు ఏది చేసినా కాస్త వింతగానే ఉంటుంది. ఇంతముందు బాలయ్య బాబు పాటలు, స్పీచ్ లతో ఫ్యాన్స్ ను యాంటీ ఫ్యాన్స్ ఎంటర్ టైన్ చేస్తుండేవారు. ఇప్పుడేంటో ఆయన ఏది మాట్లాడినా, ఏం చేసినా కాంట్రవర్సీ అయిపోతుంది.
-
- మొన్నటికిమొన్న వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ ఈవెంట్ లో అక్కినేని తొక్కినేని అంటూ వివాదంలో చిక్కుకున్న బాలయ్య ఎలాగోలా బయటపడ్డారనుకులోపే మళ్లీ కొత్త కాంట్రవర్సిని తెరమీదకు తెచ్చారు మన బుల్.. బుల్ బాలయ్య.
-
- అయితే అన్ స్టాపబుల్ రియాలిటీ షో ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరికీ తెలుసు. ప్రతీ ఎపిసోడ్ కొత్త ఉండేలా ప్లాన్ చేస్తున్నారు ఆ షో టీమ్. రీసెంట్ అన్ స్టాపబుల్ షోకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వచ్చారు. ఈ షోలో బాలయ్య మళ్లీ నోరు జారారు. అదేంటంటే యాక్సిడెంట్ ఆస్పత్రి అంటూ చెప్తూ.. చెప్తూ.. ‘ ఆ నర్సు దానమ్మ భలే అందంగా’ ఉందంటూ కాంట్రవర్సీ కమెంట్స్ చేశారు.
-
- నందమూరి బాలకృష్ణ. బాలయ్య బాబుతో ఈ అన్ స్టాపబుల్ షోకు మంచి రేటింగ్ అయితే వస్తోంది కానీ.. ఈ తీట బాలయ్య ఇంకెన్ని కాంట్రవర్సిలు చేస్తారో చూడాలి మరి.

Ehatv
Next Story