✕
Andhra Khajuraho temple : ఆంధ్ర ఖజురాహో... కొత్త జంటలకు ఆ గుళ్లోనే ఫస్ట్ నైట్!
By EhatvPublished on 1 March 2024 6:01 AM GMT
శ్రీకాకుళం(Srikakulam) జిల్లా మొళియాపుట్టి జంక్షన్లో(Molliaputty Junction) ఓ ప్రాచీన ఆలయం(Ancient temple) ఉంది. ఒడిశా(Odisha) సరిహద్దుల్లోనే ఉన్న ఈ గుడిలో రాధా వేణుగోపాలస్వామి కొలువై ఉన్నారు. ఈ ఆలయాన్ని ఆంధ్ర ఖజురాహో(Andhra Khajuraho) అంటారు. ఖజురాహోలాగే ఇక్కడ కూడా శృంగార శిల్పాలు ఉంటాయి. చాలా ఆలయాలలో శృంగార శిల్పాలు ఉన్నా ఇక్కడ కొంచెం ఎక్కువగా ఉంటాయి.

x
Andhra Khajuraho temple
-
- శ్రీకాకుళం(Srikakulam) జిల్లా మొళియాపుట్టి జంక్షన్లో(Molliaputty Junction) ఓ ప్రాచీన ఆలయం(Ancient temple) ఉంది. ఒడిశా(Odisha) సరిహద్దుల్లోనే ఉన్న ఈ గుడిలో రాధా వేణుగోపాలస్వామి కొలువై ఉన్నారు. ఈ ఆలయాన్ని ఆంధ్ర ఖజురాహో(Andhra Khajuraho) అంటారు.
-
- ఖజురాహోలాగే ఇక్కడ కూడా శృంగార శిల్పాలు ఉంటాయి. చాలా ఆలయాలలో శృంగార శిల్పాలు ఉన్నా ఇక్కడ కొంచెం ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ ఆలయానికి అన్నాచెల్లెల్లు, అక్కాతమ్ముడు కలిసి రానేరారు.
-
- వచ్చినా ఆలయ నిర్వాహకులు అనుమతించరు. కొత్తగా పెళ్లయినవారు మాత్రం ఎంతో ఉత్సాహంతో వస్తారు. ఇక్కడే మొదటి రాత్రిని(First night) కూడా జరుపుకుంటారు. సుమారు 200 సంవత్సరాలుగా ఈ ఆచారం కొనసాగుతున్నదట! 1840లో నిర్మించిన ఈ ఆలయం కళింగ శైలిలో ఉంటుంది.
-
- ఆలయం ప్రాంగణంలో ఉన్న రాతిమెట్లు, శిల్పకళా సౌందర్యం ఇట్టే కట్టిపడేస్తాయి. అప్పట్లో మెళియాపుట్టి ప్రాంతాన్ని పర్లామికిడి మహారాజు వీరవీరేంద్రప్రతాప రుద్ర గజపతి నారాయణదేవ్ పాలించేవాడు.
-
- మహారాణి విష్ణుప్రియ మహారాజును ఓ కోరిక కోరింది. ఆ కోరికేమిటంటే అద్భుతమైన శృంగారశిల్పాలతో అలరారే ఓ ఆలయాన్ని నిర్మించాలని. ముచ్చటపడి అడిగిన మహారాణి ముచ్చటను మహారాజు తీర్చాలి కదా! చుట్టుపక్కల పేరొందిన శిల్పకారులందరినీ పిలిపించాడు.
-
- వారంతా అహోరాత్రాలు కష్టపడి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. లైంగిక విజ్ఞానం పట్ల అవగాహన కల్పించడానికే శృంగార శిల్పాలు చెక్కినట్టు స్థానికులు చెబుతుంటారు. నవ దంపతులు ఆలయ ప్రదక్షిణలుచేస్తూ శృంగార శిల్పాలను చూస్తూ ఉద్దీపన పొందుతారు.

Ehatv
Next Story